E-Paper
Advertisement

Jetlee OTT : ‘ జెట్లీ’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

Jetlee OTT : ‘ జెట్లీ’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?
Advertisement

Jetlee OTT : టాలీవుడ్ స్టార్ కమెడియన్ సత్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన నటించిన సినిమా జెట్లీ నిన్న థియేటర్లలోకి వచ్చేసింది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను బాగా నవ్వించేసింది. కొన్ని ఏరియాలో అక్కడక్కడ ఈ సినిమాకు రెస్పాన్స్ తగ్గినా కూడా మరికొన్ని ఏరియాల్లో మాత్రం మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్లను కూడా కొల్లగొట్టేసింది.. కామెడీ ఎంటర్టైనర్ గా తెరికెక్కిన ఈ మూవీ ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఇక ఈ చిత్రం ఓటీటీ వివరాల గురించి ఒక ఆసక్తి నెలకొంది. మరి ఏ ఓటీటీలోకి రాబోతుందో ఒకసారి చూసేద్దాం..

‘జెట్లీ ‘ ఓటీటీ డీటెయిల్స్..

గతంలో ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కామెడీ థ్రిల్లర్‌గా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చెర్రీ, హేమలత ఈ సినిమాను నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా భారీ కథనంతో మే 1 న థియేటర్లలోకి రిలీజ్ అయ్యింది. సత్య సరసన రియా సింఘా హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, అజయ్, వైవా హర్ష, కబీర్ బేడీ, శ్రీనివాసరెడ్డి తదితరులు కీలకపాత్రల్లో నటించారు.. మొదటి రోజునే ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. వీకెండ్ కావడంతో కలెక్షన్లు ఈ సినిమాకి మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ మూవీ ఓటిటి పార్ట్నర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనికి భారీ ధరను చెల్లించి ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ రావడంతో నాలుగు వారాల తర్వాతే అంటే జూన్ రెండవ వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

Advertisement

Also Read :నిర్మాతలుగా సినిమాలు చేసి కోట్లు పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్లు..

సత్య హిట్ కొట్టాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని కమెడియన్లు హీరోలుగా మారి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. బ్రహ్మానందం, ఆలీ లాంటి కమెడియన్లు సైతం ఒకప్పుడు హీరోలుగా చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే ట్రైండ్ని కమెడియన్ సత్యా కూడా ఫాలో అయ్యారు. ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా జెట్లీ.. దాదాపుగా రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు తెలుస్తుంది. మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ టీజర్స్ ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే కామెడీ ఎంటర్టైనర్ గా జనాలు ఈ సినిమాకి నీరాజనం పలుకుతున్నారు. దాంతో సత్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా మంచి హిట్ అందుకొని ఉందని తెలుస్తుంది. మరి ఈ మూవీ కలెక్షన్స్ ఎక్కడ ఎలా ఉంటాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×