// // Sarvam Maya OTT : థియేటర్లలో సంచలనం సృష్టించిన మలయాళ -->
E-Paper
Advertisement

Sarvam Maya OTT : థియేటర్లలో సంచలనం సృష్టించిన మలయాళం హారర్ ఫాంటసీ మూవీ ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు ?

Sarvam Maya OTT : థియేటర్లలో సంచలనం సృష్టించిన మలయాళం హారర్ ఫాంటసీ మూవీ ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు ?
Advertisement

Sarvam Maya OTT : రీసెంట్ గా విడుదలై థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఫాంటసీ హార్రర్ మూవీ ‘సర్వం మాయ’ (Sarvam Maya Movie). ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ ఓటీటీలో త్వరలోనే సందడి చేయబోతోంది. మరి నవీన్ పౌలీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్

నివిన్ పౌలీ, ప్రీతీ ముకుందన్ హీరోహీరోయిన్లుగా నటించిన హారర్ మూవీ సర్వం మాయ. అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లు దద్దరిల్లేలా చేసింది. ఈ మలయాళం హార్రర్ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలోకి వచ్చింది. సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లి, కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి, నిర్మాతలకు కాసుల పంట పండించింది ఈ మూవీ. అంతేకాదు ఈ ఘనతను సాధించిన నివిన్ పౌలీ ఫస్ట్ మూవీగా మరో రికార్డును క్రియేట్ చేసింది.

Advertisement

ఈ సినిమాలో నివిన్ తో పాటు రియా శిబు, అజు వర్గీస్, ప్రీతీ ముకుందన్, జనార్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్ లో చేసిన ఈ మలయాళం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆరా తీస్తున్నారు ఆడియన్స్. సమాచారం ప్రకారం జియో హాట్ స్టార్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. అయితే స్ట్రీమింగ్ కు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ ఫిబ్రవరిలోనే సర్వం మాయ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతంటే మేకర్స్ నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగాల్సిందే.

Read Also : బాబోయ్… ట్విస్టులే ట్విస్టులు… మెంటలెక్కించే ఫీల్ గుడ్ బెంగాలీ డిటెక్టివ్ డ్రామా

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

సర్వం మాయ మూవీ ఒక హిందూ పూజారి చుట్టూ తిరుగుతుంది. అతనికి ఒక ఆత్మ కనిపించడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. అది అతీంద్రియ శక్తిగా మొదలై… దేవుడి పట్ల పూజారి నమ్మకాన్ని, అతను బోధించే బోధనలను ప్రశ్నించేలా టర్న్ తీసుకుంటుంది. మరి ఆత్మ ఎంట్రీతో హీరో లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి ? ఇంతకీ ఆ ఆత్మ ఎవరు ? ఎందుకు హీరో దగ్గరకు వచ్చింది ? క్లైమాక్స్ ఏంటి ? 100 కోట్లు రాబట్టెంతగా సినిమాలో ఏముంది ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేదాకా ఆగాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×