E-Paper
Advertisement

ప్రతి ఎపిసోడ్ 9.7 రేటింగ్… విజయం సాధించడానికి చెల్లించాల్సిన భారీ మూల్యం

ప్రతి ఎపిసోడ్ 9.7 రేటింగ్… విజయం సాధించడానికి చెల్లించాల్సిన భారీ మూల్యం
Advertisement

Highest IMDb Rated Web Series : ఓటీటీలోకి కుప్పలు తెప్పలుగా సిరీస్ లు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ బీట్ చేసి బెస్ట్ రేటింగ్, అందులోనూ ప్రపంచంలోనే హయ్యేస్ట్ రేటింగ్ తెచ్చుకోవడం అనే మామూలు విషయం కాదు. ఈరోజు మన మూవీ సజెషన్ అలాంటి రేటింగ్ తెచ్చుకున్న సిరీస్ Sapne Vs Everyone. మరి ఈ సిరీస్ రేటింగ్ ఎంత ? ఎందుకు టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది ? అన్నది తెలుసుకుందాం.

ప్రపంచంలోనే హయ్యేస్ట్ రేటింగ్

TVF సిరీస్‌లు ఎప్పుడూ విభిన్న కథాంశాలు, సహజ నటన, హృదయానికి హత్తుకునే కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ‘పంచాయత్’, ‘పర్మనెంట్ రూమ్‌మేట్స్’ తరహాలో ఇప్పుడు ‘సప్నే వర్సెస్ ఎవ్రీవన్ సీజన్ 2’ ఓటీటీలో భారీ సంచలనం సృష్టిస్తోంది. అంబ్రిష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ పొందిన వెబ్ సిరీస్‌ల్లో ఒకటిగా నిలిచింది. 2023లో వచ్చిన మొదటి సీజన్‌ తోనే ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న ఈ సిరీస్, 2026 మేలో విడుదలైన రెండవ సీజన్‌తో మరింత ఎత్తుకు చేరుకుంది. IMDbలో సీజన్ 1లోని ప్రతి ఎపిసోడ్ 9.4 నుంచి 9.7 వరకు రేటింగ్‌లు పొందగా, సీజన్ 2లో అన్ని ఎపిసోడ్‌లు సగటున 9.7లో పైగా రేటింగ్ సాధించాయి. ఒక ఎపిసోడ్ 9.8 రేటింగ్‌తో రికార్డు సృష్టించింది.ఇది సాధారణ విజయం కాదు. ప్రపంచంలోని అత్యధిక రేటింగ్ పొందిన వెబ్ సిరీస్‌ల్లో ఇది ఒకటిగా నిలవడంతో ఈ సిరీస్ వైరల్ అవుతోంది.

కథలోకి వెళ్తే..

Advertisement

ఈ సిరీస్ ఇద్దరు యువకుల సమాంతర ప్రయాణాలను చూపిస్తుంది. తమ లక్ష్యాలను సాధించడానికి వారు ఎదుర్కొనే సవాళ్లు, కఠినమైన వ్యవస్థ, సమాజం చేసే ఒత్తిడి, వ్యక్తిగత త్యాగాలు, కుటుంబ బంధాలు – అన్నీ చాలా సహజంగా, హాస్యం, ఎమోషన్‌ను మేళవించి చూపించారు. మొదటి సీజన్‌లో ప్రారంభమైన కథ రెండవ సీజన్‌లో మరింత లోతుగా, మరింత ఉద్వేగంగా సాగుతుంది. కలలు సాకారం కావడానికి చెల్లించాల్సిన ధర ఎంత భారీగా ఉంటుందో హృదయానికి హత్తుకునేలా చూపించారు.

ఎక్కడ చూడవచ్చు ?

ఇందులో ప్రతి నటుడి పర్ఫార్మెన్స్ సహజంగా ఉండటం ఈ సిరీస్‌కు ప్రధాన బలం. కుటుంబంతో కలిసి చూడగలిగే క్లీన్ కంటెంట్ ఈ సిరీస్. హాస్యం, ఎమోషన్, రియల్ లైఫ్ స్ట్రగుల్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ గా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ ఎండ్‌లో కొత్త క్యూరియాసిటీ ఉండి… యువత, మధ్యతరగతి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. TVF యూట్యూబ్ ఛానల్, అనుబంధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.

Advertisement

మొదటి సీజన్‌లో ఐదు ఎపిసోడ్‌లు రేటింగ్

ఎపిసోడ్ 1 – 9.4 రేటింగ్
ఎపిసోడ్ 2 – 9.5 రేటింగ్
ఎపిసోడ్ 3 – 9.6 రేటింగ్
ఎపిసోడ్ 4 – 9.6 రేటింగ్
ఎపిసోడ్ 5 – 9.7 రేటింగ్

రెండవ సీజన్ ఎపిసోడ్ల రేటింగ్

ఎపిసోడ్ 1 – 9.7 రేటింగ్
ఎపిసోడ్ 2 – 9.7 రేటింగ్
ఎపిసోడ్ 3 – 9.7 రేటింగ్
ఎపిసోడ్ 4 – 9.7 రేటింగ్
ఎపిసోడ్ 5 – 9.8 రేటింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×