// // santhana prapthirasthu OTT: ఒకేసారి రెండు ఓటీటీలలో సంతాన ప్రాప్తిరస్తు.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

santhana prapthirasthu OTT: ఒకేసారి రెండు ఓటీటీలలో సంతాన ప్రాప్తిరస్తు..

santhana prapthirasthu OTT: ఒకేసారి రెండు ఓటీటీలలో సంతాన ప్రాప్తిరస్తు..
Advertisement

Santhana Prapthirasthu OTT: ఇటీవల కాలంలో ఒక సినిమా థియేటర్లో విడుదల అయింది అంటే నెల తిరగకుండానే ఓటీటీలలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నవంబర్ నెలలో పెద్ద ఎత్తున సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాలన్నీ తిరిగి వరుసగా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇకపోతే గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu) సినిమా ఒకటి. విక్రాంత్ (Vikranth) చాందిని చౌదరి (Chandini Chowdary)హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

పెళ్లి, పిల్లల నేపథ్యంలో..

సంజీవరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేమ పెళ్లి పిల్లలు అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలలో విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది అయితే ఈ సినిమా ఒకేసారి రెండు ఓటీటీలలో అందుబాటులోకి రాబోతుండటం విశేషం. ఈ సినిమా డిసెంబర్ 19వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)తో పాటు జియో హాట్ స్టార్(Jio Hotstar) లో ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతోంది. ఇక థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్ అయిన వారు ఇలా రెండు ఓటీటీలలో ప్రసారమవుతున్న ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.

సంతానం కోసం ఆరాటం..

Advertisement

ఈ సినిమాలో చాందిని చౌదరి విక్రాంత్ హీరో హీరోయిన్లుగా నటించగా వెన్నెల కిషోర్ మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, అభినవ్ గోమటం, రచ్చ రవి తాగుబోతు రమేష్ వంటి తదితరులు కూడా కీలకపాత్రలలో కనిపించే సందడి చేశారు. ఇటీవల కాలంలో పెళ్లి చేసుకున్న దంపతులకు సంతానం లేక ఎలా ఇబ్బంది పడుతున్నారనే విషయాలను ఈ సినిమా ద్వారా చక్కగా తెలియజేశారనే చెప్పాలి. మరి ఈ సినిమా కథ ఏంటి అని విషయానికి వస్తే..

సినిమా కథ..

Advertisement

చైతన్య (విక్రాంత్) సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కనిపిస్తారు తన స్నేహితుడు సుబ్బు (అభినవ్ గోమటం) ను ఎగ్జామ్స్ సెంటర్ దగ్గర వదలడానికి వెళ్తే అక్కడ కళ్యాణి (చాందిని చౌదరి) ని చూసి ప్రేమలో పడతారు ఇక అమ్మాయి వివరాలు తెలుసుకున్న చైతన్య తనని కలవడం కోసం తన ఊరికి వెళ్ళగా అక్కడ కళ్యాణి తండ్రి ఈశ్వర రావు (మురళీధర్ గౌడ్)కు ఈ విషయం తెలిసి వారిద్దరిని కలవకుండా చూస్తారు అయితే చైతన్య కళ్యాణి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ ఇంట్లో వారికి తెలియకుండా పెళ్లి చేసుకుంటారు. వీళ్ళ పెళ్లినీ పెద్దలు అంగీకరించాలి అంటే పిల్లలు పుట్టాలని నిర్ణయించుకుంటారు కానీ చైతన్యకు స్పర్మ్ కౌంటు తక్కువగా ఉండడంతో పిల్లలు పుట్టే అవకాశం ఉండదని చెబుతారు దీంతో ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం, పిల్లల కోసం చైతన్య ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే కథ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Also Read: DacoitTeaser: కన్నె పిట్టరో.. కన్ను కొట్టరో అంటూ డెకాయిట్ టీజర్ రిలీజ్..

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×