E-Paper
Advertisement

Sankranthi Movies OTT : ఈ ఒక్కరోజే ఓటీటీలోకి రెండు సంక్రాంతి బ్లాక్ బస్టర్స్… మీరేది చూడబోతున్నారు ?

Sankranthi Movies OTT : ఈ ఒక్కరోజే ఓటీటీలోకి రెండు సంక్రాంతి బ్లాక్ బస్టర్స్… మీరేది చూడబోతున్నారు ?
Advertisement

Sankranthi Movies OTT : సంక్రాంతి సీజన్‌లో థియేటర్లలో భారీ విజయం సాధించిన రెండు తెలుగు సినిమాలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో మిస్ అయిన వారికి లేదా మళ్లీ ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలనుకున్నవారికి ఇది అద్భుతమైన అవకాశం. ఒకే రోజు రెండు బ్లాక్‌బస్టర్ కామెడీ హిట్‌లు డిజిటల్‌గా విడుదల కానుండడంతో, కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వైబ్ ని కొనసాగించడానికి ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అవుతుంది. మరి ఒకేసారి రిలీజ్ కాబోతున్న ఆ హిట్ సినిమాలు ఏంటి? ఏ ఓటీటీలో ఏ సినిమాను చూడవచ్చు ? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu)

ఈ లిస్ట్ లో మొదటగా చెప్పుకోవాల్సిన సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ యాక్షన్-కామెడీ ఫిల్మ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. సంక్రాంతి సమయంలో థియేటర్లలో విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీలో చిరంజీవి రోల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సినిమాలో ఆయన టైమింగ్, డైలాగ్ డెలివరీ, ఎనర్జీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నయనతారతో చిరు కెమిస్ట్రీ అద్భుతంగా సాగింది. ముఖ్యంగా వెంకటేష్ అతిథి పాత్రలో వచ్చిన సన్నివేశాలు, ఆయనతో చిరంజీవి చేసిన డైలాగ్ డ్యూయల్స్, ఫన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులను క్రేజీగా ఫీల్ అయ్యేలా చేశాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, కామెడీ అన్నీ సమపాళ్లలో ఉండటం వల్ల ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ZEE5లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అంటే ఈ రోజు అర్దరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఏడు భాషల్లో విడుదలైన మొదటి తెలుగు సినిమాల్లో ఒకటి కావడం విశేషం.

Advertisement

Also Read : డబ్బుకు కొదవే లేదని కొరివితో తల గోక్కునే మెంటలోడు… బుర్రపాడు ట్విస్టులు మావా

అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju)

మరోవైపు ‘అనగనగా ఒక రాజు’ కూడా ఈరోజు రాత్రి నుంచే ఓటీటీలో సందడి చేయనుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ విలేజ్ పొలిటికల్ కామెడీ మూవీ మారి దర్శకత్వంలో తెరకెక్కింది. సంక్రాంతి సమయంలో థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, క్యారెక్టరైజేషన్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. గ్రామీణ నేపథ్యంలో రాజకీయాలు, సరదా హాస్యం కలిసి ఉండటం వల్ల ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మీనాక్షి చౌదరి నటన, ఆమెతో నవీన్ కెమిస్ట్రీ కూడా బాగుంది. ఇప్పుడు ఈ చిత్రం Netflixలో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలో ప్రీమియర్ కావడం ఆసక్తికరంగా మారింది. ఒకటి జీ5లో, మరొకటి నెట్ ఫ్లిక్స్ లో ఆడియన్స్ ను అలరించబోతున్నాయి. మరి ఇందులో ముందుగా మీరు ఏ మూవీని చూడాలి అనుకుంటున్నారు ?

Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×