E-Paper
Advertisement

Romantic Comedy Movie OTT : వరణాసిలో వరుడి కష్టాలు… ప్రియుడికి వింత కండిషన్ పెట్టే పిల్ల తండ్రి… ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ

Romantic Comedy Movie OTT : వరణాసిలో వరుడి కష్టాలు… ప్రియుడికి వింత కండిషన్ పెట్టే పిల్ల తండ్రి… ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ
Advertisement

Romantic Comedy Movie OTT : ఓటీటీలోకి వారణాసి నేపథ్యంలో సాగే ఒక ఫ్యామిలీ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, మూడు నెలల తర్వాత డిజిటల్ గా అడుగుపెట్టింది. ఈ కథలో తండ్రికి పెళ్లి చేస్తేనే కొడుకు పెళ్లి అవుతుందన్న పాయింట్ చుట్టూ కథ ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌ లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. అక్కడ ఒక కొడుకు తన తండ్రి ఒంటరితనాన్ని పోగొట్టడానికి స్వయంగా సంబంధాలు వెతికి రెండో పెళ్లి చేశాడు. చాలా కాలం తర్వాత మహిమా చౌదరి ఈ సినిమాతో వెండితెరపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సంజయ్ మిశ్రా తన సహజ సిద్ధమైన నటనతో వారణాసి బార్బర్‌ పాత్రలో ఒదిగిపోయారు. ఈ కథలో కేవలం కామెడీ మాత్రమే కాకుండా, వయసు పైబడిన వారికి కూడా తోడు ఎంత అవసరమో అనే విషయాన్ని దర్శకుడు చాలా చక్కగా చూపించాడు.

జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

ఈ హిందీ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘దుర్లభ్ ప్రసాద్ కి దుస్రీ షాదీ’ (Durlabh Prasad Ki Dusri Shadi). సిద్ధాంత్ రాజ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ మిశ్రా, మహిమా చౌదరి, వ్యోమ్ యాదవ్, పల్లక్ లల్వానీ తదితరులు నటించారు. ఈ సినిమా 2025 డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలై ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా 2026 మార్చి 23 నుండి జియోహాట్‌స్టార్‌ (Jio hotstar)లో అందుబాటులో ఉంది. అనురాగ్ సైకియా అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ఎమోషన్స్‌ని బాగా పండించింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మురళి అనే కుర్రాడు మెహక్ అనే అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుందామని మెహక్ వాళ్ళ ఇంటికి వెళ్తే, అక్కడ ఆమె తండ్రి బ్రహ్మనారాయణ్ ఒక వింత కండిషన్ పెడతాడు. ఆడపిల్ల లేని ఇంట్లో తన కూతురిని పెంచడానికి అస్సలు అస్సలు ఒప్పుకోడు. అతను మెహక్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు, మురళి తండ్రి అయిన దుర్లభ్ ప్రసాద్‌ (సంజయ్ మిశ్రా)ను తిరిగి పెళ్లి చేసుకోమని చెప్తాడు. దుర్లభ్ ప్రసాద్ స్వయంగా బార్బర్ షాపును నడుపుతుంటాడు. అతను నడిపే ఆ చిన్న సెలూన్ షాపు కూడా కాశీలోని ఇరుకైన గల్లీల్లోనే ఉంటుంది. భార్య చనిపోవడంతో చాలా కాలం ఒంటరిగానే గడుపుతుంటాడు. ఇప్పుడు కొడుకు పెళ్లి జరగాలంటే, తన తండ్రికి ఒక సంబంధం చూడాల్సి వస్తుంది. ఈ క్రమంలో మురళి పడే పాటలు కడుపుబ్బ నవ్విస్తాయి కూడా.

తన పెళ్లి కోసం తన 55 ఏళ్ల ముసలి తండ్రికి సంబంధాలు వెతకడం మొదలుపెడతాడు మురళి. మురళి తన తండ్రికి తోడు కావాలని పట్టుబట్టి, చివరికి బబిత (మహిమా చౌదరి) అనే మహిళను లైన్లోకి తెస్తాడు. మొదట్లో దుర్లభ్ ప్రసాద్ ఈ వయసులో పెళ్లేంటని మొండికేసినా, తర్వాత బబితతో పరిచయం పెరిగాక మెల్లగా ఆమె వైపు మొగ్గు చూపుతాడు. అయితే సమాజం ఏమనుకుంటుందో అన్న భయం, ఇరుగుపొరుగు వాళ్ల వెటకారాల మధ్య ఈ ముసలోడి పెళ్లి ముచ్చట ఎలా ముందుకు సాగిందనేది చాలా సరదాగా సాగుతుంది. మొత్తానికి కొడుకు తన పెళ్లి కోసం తండ్రిని ఎలా ఒప్పించాడు ? ఆ ఇంట్లోకి కొత్త అమ్మ ఎలా వచ్చింది ? తన పెళ్ళికి మురళి లైన్ ఎలా క్లియర్ చేసుకున్నాడు ? అనే విషయాలను సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఆటలో చిక్కుకున్న కుర్రది… అన్నతో ప్రేమ తమ్ముడితో రొమాన్స్… నోరెళ్ళబెట్టించే సీన్స్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×