E-Paper
Advertisement

Sampradayini Suppini Suddapoosani OTT : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Sampradayini Suppini Suddapoosani OTT : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Advertisement

Sampradayini Suppini Suddapoosani OTT : శివాజీ, లయ నటించిన తెలుగు మూవీ ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసాని’ డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ప్రేక్షకులు థియేటర్లకు వెల్లకుండానే, తమ ఇళ్ల నుండి ఈ చిత్రాన్ని చూసేయచ్చు. ఇప్పటికే ఈ జంట అనేక సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా క్రైమ్ కామెడీ కథతో చిత్తూరు జిల్లా నేపథ్యంలో వస్తోంది. చాలా కాలం తర్వాత శివాజీ, లయ మళ్లీ జంటగా నటించడం విశేషం. ఇక శివాజీ హిట్ వెబ్ సిరీస్ 90s తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సిరీస్ విజయం తర్వాత అతను అనేక చిత్రాలకు సంతకం చేశాడు. ఇటీవల వచ్చిన ‘దండోరా’ సినిమా కూడా మంచి రెస్పాన్స్ దక్కించికుంది. ఇప్పుడు ఈ సినిమాకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి. ఇక ఇది ఏ ఓటీటీలో ఎప్పుడు వస్తుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కి వస్తుందంటే

సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసాని’ (Sampradayini Suppini Suddapoosani) డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ (ETV Win) పొందినట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఇది 2026 ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే నిర్మాతలు థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా డిజిటల్ విడుదలను ఎంచుకున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో శివాజీ, లయతో పాటు అలీ, ధనరాజ్, రఘు బాబు, రోషన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రజనీ రాజ్ సంగీతం అందించారు.

చిత్తూరు నేపథ్యంలో కథ

Advertisement

ఈ చిత్రం కథ చిత్తూరు నేపథ్యంలో సాగుతుంది. ఇందులో శ్రీరామ్ అనే పంచాయతీ కార్యదర్శిగా శివాజీ నటించాడు. ఒక క్రైమ్ లో ఇరుక్కున్న అతను ఎలా బయట పడ్డాడన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఇక మహిళల డ్రెస్సింగ్ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్‌కు గురికావడంతో వార్తల్లో నిలిచారు. ఈ వివాదం ఆయన ‘ధండోరా’ సినిమాపై ప్రభావం కూడా చూపించింది. ఇక అలనాటి ఈ హిట్ జంట ఇప్పుడు మళ్లీ జత కట్టడంతో ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నారు. మరి డిజిటల్ ప్రేక్షకులు ఈ సినిమాను ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు.

Read Also : హీరో నిప్పు అంటించుకుని మరీ అనౌన్స్ చేస్తే… ఏడేళ్ళ క్రితమే ఆగిపోయిన సిరీస్… ఇన్నేళ్ల తరువాత అప్డేట్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×