E-Paper
Advertisement

సమంత ‘మా ఇంటి బంగారం’ అఫీషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

సమంత ‘మా ఇంటి బంగారం’ అఫీషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!
Advertisement

Samantha:దాదాపు తెలుగు సినీ ఇండస్ట్రీకి మూడేళ్ల పాటు విరామం తీసుకుని.. మళ్లీ ఫ్యామిలీ , యాక్షన్ ఓరియంటెడ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. అదే ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో శ్రీముఖి, గౌతమి, శ్రీలక్ష్మి, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తూ తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. ముఖ్యంగా ఇందులో సమంత తన అద్భుతమైన నటనను కనబరిచి.. మరొకసారి తన యాక్షన్ పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది . జూలై 19వ తేదీన థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే మూడు వారాల్లోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దూసుకుపోతోంది. అంతేకాదు తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక వసూలు రాబట్టిన లేడీ ఓరియంటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది ఈ సినిమా.

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న సమంత మా ఇంటి బంగారం..

అలాంటి ఈ సినిమా తాజాగా ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం జియో హాట్ స్టార్ వేదికగా జూలై 17వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. ఈ మేరకు జియో హాట్ స్టార్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ థియేటర్లలో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మా ఇంటి బంగారం ఓటీటీ లోనూ దూసుకెల్లడం ఖాయంగా కనిపిస్తోంది.. “జూలై 17వ తేదీన ఒక్కొక్కడిని కొడతాము చూడు.. ప్రేమతో అబ్బా” అంటూ సమంత చెప్పే డైలాగ్ ను ఉపయోగిస్తూ జూలై 17వ తేదీన ఈ సినిమాని జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మొత్తానికైతే థియేటర్లలో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

also read:తిరుపతినైనా ఎదిరిస్తా.. నిన్ను మాత్రం వదలను మంగ.. ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్!

వన్ ఉమెన్ షో..

సమంత ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించడమే కాకుండా ఈ చిత్రానికి తన సొంత బ్యానర్ అయిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్ బ్యానర్ పై నిర్మించింది కూడా.. ఈమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు అందించిన కథతో నందిని రెడ్డి ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. సమంత నటన, యాక్షన్.. నందిని రెడ్డి టేకింగ్ సినిమాకి ప్రధాన బలంగా నిలవగా.. రొటీన్ కథతోనే సమంత వెండితెరపై మ్యాజిక్ చేసి చూపించారు. కుటుంబ కథలను వైవిధ్యంగా ఆవిష్కరిస్తే థియేటర్ కి ప్రేక్షకులను రప్పించవచ్చు అని ఈ సినిమా మరోసారి నిరూపించింది. మొత్తానికైతే సమంత ఇప్పుడు ఓటీటీలలో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది.

Advertisement

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×