E-Paper
Advertisement

అతను అడుగు పెడితే అనుమానాస్పద మరణాలు… వింటేజ్ వ్యాంపైర్ థ్రిల్లర్

అతను అడుగు పెడితే అనుమానాస్పద మరణాలు… వింటేజ్ వ్యాంపైర్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller : కొన్ని ఊళ్లు బయటకు చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి. పాత ఇళ్లు, ఖాళీ వీధులు, నెమ్మదిగా సాగే జీవితం ఉంటుంది. అయితే అలాంటి ఊర్ల వెనుక కొన్ని చీకటి రహస్యలు ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు ఊర్లోకి అడుగుపెట్టిన తర్వాత వరుసగా మనుషులు కనిపించకుండా పోతుంటారు.. మరణాలు కూడా పెరుగుతుంటాయి.. సరిగ్గా ఈ తరహా కథనే భయానకంగా, ఉత్కంఠభరితంగా చెప్పిన మూవీ సేలమ్స్ లాట్ (Salems lot). స్టీఫెన్ కింగ్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందిన ఈ 2024 హారర్ థ్రిల్లర్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. హారర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు.

ఈ సినిమా కథేంటి?

కథలో బెన్ మియర్స్ అనే రచయిత చాలా సంవత్సరాల తర్వాత తన చిన్ననాటి ఊరు జెరూసలెమ్స్ లాట్‌కు తిరిగి వస్తాడు. తన కొత్త నవల కోసం ప్రేరణ పొందాలనే ఉద్దేశంతో వచ్చిన అతనికి అక్కడి వాతావరణంలో ఏదో విచిత్రం కనిపిస్తుంది. ఊరంతా ఒక తెలియని భయంతో జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. మొదట చిన్న చిన్న ఘటనలుగా కనిపించిన విషయాలు క్రమంగా పెద్ద రహస్యంగా మారిపోతాయి. ఊర్లోకి ఒక కొత్త వ్యక్తి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత అనుమానాస్పదంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా అనారోగ్యానికి గురవడం, కొందరు రాత్రికి రాత్రే అదృశ్యం కావడం, విచిత్రమైన మరణాలు చోటుచేసుకోవడం మొదలవుతుంది. చీకటి పడిన తర్వాత బయటకు వెళ్లడానికి ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది.

Advertisement

బెన్ ఈ ఘటనల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అతనికి ఊహించని భయంకరమైన వాస్తవాలు తెలుస్తాయి. ఊర్లో జరుగుతున్నవి సాధారణ నేరాలు కాదని, వాటి వెనుక మానవ శక్తులకు అతీతమైన చీకటి దాగి ఉందని గ్రహిస్తాడు. అక్కడి నుంచి కథ పూర్తిగా మారిపోతుంది. ఇక ఈ సినిమా ప్రధాన బలం దాని వాతావరణం. ఇటు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ ప్రేక్షకులను కథలో ముంచేస్తుంది. ముఖ్యంగా పాత తరహా వ్యాంపైర్ కథలను ఆధునిక టెక్నాలజీతో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.

హారర్ అభిమానులకు ఈ చిత్రం ఎందుకు ప్రత్యేకమంటే ఇందులో కేవలం రక్తపాతం మాత్రమే కాకుండా మిస్టరీ, సస్పెన్స్, భయం కూడా బ్యాలెన్స్‌ అవుతాయి. కథ ముందుకు సాగే కొద్దీ ఊర్లోని ప్రతి వ్యక్తిపైనా అనుమానం రావడం, ఎవరు సురక్షితంగా ఉన్నారో అర్థం కాకపోవడం ఉత్కంఠను మరింత పెంచుతుంది. వ్యాంపైర్ కథలు, చీకటి వాతావరణం, పాతకాలపు హారర్ ఫీల్ ఇష్టపడేవారికి సేలమ్స్ లాట్ ఒక మంచి ఎంపిక. చీకటి పడిన తర్వాత ఆ ఊరిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.

Advertisement

Read Also : ఇష్టంలేని పెళ్లి… కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్… పెళ్ళయిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×