// // Romantic Thriller OTT : ప్రేమించిన ప్రతి ఒక్కడికి యమపురికి -->
E-Paper
Advertisement

Romantic Thriller OTT : ప్రేమించిన ప్రతి ఒక్కడికి యమపురికి టిక్కెట్టు … డిటెక్టివ్ కే మెంటలెక్కించే కేసు… ఉక్కిరి బిక్కిరి చేసే మలుపులు

Romantic Thriller OTT : ప్రేమించిన ప్రతి ఒక్కడికి యమపురికి టిక్కెట్టు … డిటెక్టివ్ కే మెంటలెక్కించే కేసు… ఉక్కిరి బిక్కిరి చేసే మలుపులు
Advertisement

Romantic Thriller OTT : కొరియన్ సిరీస్ అంటే చెవి కోసుకుంటున్నారు ఆడియన్స్. ఎన్ని ఎపిసోడ్లు ఉన్నా, వారాల తరబడి చూడడానికి కూడా వెనకాడట్లేదు. ఇక రొమాంటిక్ సిరీస్ లను చూడకుండా అస్సలు ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి రీసెంట్ గా ఒక కొరియన్ రొమాంటిక్ థ్రిల్లర్ వచ్చింది. ఇందులో ఒక అమ్మాయి ఎవరినైతే ప్రేమిస్తుందో వాళ్ళు చచ్చిపోతుంటారు. డిటెక్టివ్ ఎంట్రీతో అసలు కథ మొదలవుతుంది. ఇన్సూరెన్స్ మోసాల గురించి ఈ సిరీస్ ఇంటెన్స్ గా చూపిస్తుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ కె-డ్రామా రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘సైరెన్స్ కిస్’ (Siren’s Kiss). కిమ్ చియోల్-గ్యు దర్శకత్వం వహించిన ఈ కె-డ్రామాలో పార్క్ మిన్-యంగ్, వై హా-జున్, కిమ్ జంగ్-హ్యూన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2026 మార్చ్ 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సైరెన్స్ కిస్ లో మొత్తం 12 ఎపిసోడ్లు ఉంటాయి. ప్రైమ్ వీడియో ఇప్పుడు ఎపిసోడ్ 1, 2 మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. మిగతా ఎపిసోడ్స్ వారానికి ఒకటి చొప్పున రిలీజ్ కానున్నాయి. ఈ సిరీస్ ఏప్రిల్ 7న వచ్చే చివరి ఎపిసోడ్ తో ముగుస్తుంది. ‘సైరెన్స్ కిస్’ 1999 జపనీస్ సిరీస్ ‘కూరి నో సేకా’ కి రీమేక్.

స్టోరీ ఏమిటంటే

Advertisement

వూ-సోక్ ఒక స్మార్ట్ ఇన్సూరెన్స్ ఇన్వెస్టిగేటర్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం జరిగే మోసాలను కనిపెట్టడంలో అతను దిట్ట కూడా. ఈ క్రమంలో అతనికి హాన్ సోల్ అనే మిస్టరీ మహిళ గురించి తెలుస్తుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. అయితే ఒక వింత ఏమిటంటే, ఆమె గతంలో ప్రేమించిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంటారు. దీనివల్ల ఆమె మీద అందరికీ అనుమానం కలుగుతుంది. ఆమె నిజంగానే ఒక సీరియల్ కిల్లరా లేక ఆమె చుట్టూ ఏదైనా పెద్ద కుట్ర జరుగుతుందా అనేది తెలుసుకోవడానికి వూ-సోక్ రంగంలోకి దిగుతాడు. అయితే ఇతను అక్కడకి వచ్చి లవ్ ట్రాక్ నడుపుతాడు.

నిజం బయటపెట్టడానికి వూ-సోక్ ప్లాన్ వేసి, ఆమెతో ప్రేమలో ఉన్నట్లు నటిస్తూ ఆమెకు దగ్గరవుతాడు. కానీ ఆమెతో గడిపే కొద్దీ, ఆమెలోని అమాయకత్వం చూసి అతను నిజంగానే ప్రేమలో పడిపోతాడు. ఆమె ఒక వైపు అతన్ని తన వైపు లాక్కుంటూ ఉంటే, మరోవైపు ఆమె గతం గురించిన భయంకరమైన నిజాలు బయటపడుతుంటాయి. చివరికి అతను ఆమెను కాపాడతాడా ? ఆమె వేసిన వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతాడా ? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ కథ సాగుతుంది.

Advertisement

Read Also : మహిళలకు నరకం చూపించే వింత సైకో… సూదులు గుచ్చి వెర్రి వేషాలు… చూస్తే బుర్ర పాడే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×