E-Paper
Advertisement

కోరిక తీర్చుకొనే ప్రియుడు…పగతో రగిలిపోయే ప్రియురాలు… ఈ సినిమా పెద్దలకు మాత్రమే

కోరిక తీర్చుకొనే ప్రియుడు…పగతో రగిలిపోయే ప్రియురాలు… ఈ సినిమా పెద్దలకు మాత్రమే
Advertisement

Romantic Thriller OTT : ఓటీటీలో ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాలను థియేటర్లకంటే డిజిటల్ గానే ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వీటిలో రొమాంటిక్ థ్రిల్లర్లు చూపు తిప్పుకోకుండా చేస్తుంటాయి. అందులోనూ ప్రేమించి మోసం చేసే ప్రియుడిపై రివేంజ్ అంటే మామూలుగా ఉండదు. అలాంటి సినిమా గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. క్లైమాక్స్ మరో లెవెల్ లో ఉంటుంది. అయితే ఇందులో బోల్డ్ కంటెంట్ కూడా ఎక్కువే. పెద్దలు మాత్రమే ఈ సినిమాను చూడటం మంచిది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియన్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా పేరు ‘స్కార్లెట్ ఇన్నోసెన్స్’ (Scarlet Innocence). యిమ్ పిల్-సంగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో జంగ్ వూ-సుంగ్, ఎసోమ్, పార్క్ సో-యంగ్ లీడ్ రోల్స్ లో నటించారు. 2014 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రధాన నటులైన జంగ్ వూ-సుంగ్, ఎసోమ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఒక గర్విష్టి ప్రొఫెసర్‌గా, ఆపై చూపు కోల్పోయిన నిస్సహాయుడిగా జంగ్ వూ-సుంగ్ అద్భుతంగా నటించగా, ఎసోమ్ తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అమాయకపు పల్లెటూరి పిల్లగా, పగతో రగిలిపోయే యువతిగా ఆమె నటించిన తీరుకు ‘ఉత్తమ నటి’ గా పలు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా అందుకుంది. ప్రస్తుతం ఇది Amazon Prime Video, Rakuten Viki అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన హక్-క్యూ ఒక లైంగిక వేధింపుల ఆరోపణల వల్ల సస్పెండ్ అవుతాడు. దీంతో కొంతకాలం ఒక పల్లెటూరిలో సమయం గడిపేందుకు వస్తాడు. అక్కడ అమాయకంగా ఉండే 20 ఏళ్ల డియోక్ అనే ఒక పడుచుపిల్ల అతగాడి మాటలకు పడిపోతుంది. ఇద్దరి మధ్య గట్టిగా అఫైర్ నడుస్తుంది, ఆ పిల్ల అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతుంది. కానీ తీరా అతనికి ఉద్యోగం మళ్ళీ రాగానే, ఆ పిల్లను మోసం చేసి తన దారిన తాను వెళ్ళిపోతాడు.

అతను వెళ్ళిపోయాక ఆ పిల్ల జీవితం నాశనమైపోతుంది. అతని అసలు బుద్ది తెలుసుకుంటుంది. ఇక తన వాళ్ళను, తన పరువును కోల్పోయి కసితో రగిలిపోతుంది. ఎనిమిదేళ్ల తర్వాత, ఆ ప్రొఫెసర్ పెద్ద రైటర్ అయిపోయి, విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. కానీ అతిగా తాగడం వల్ల మెల్లగా కంటి చూపు కోల్పోతుంటాడు. సరిగ్గా అదే టైమ్‌లో డియోక్ తన పేరు మార్చుకుని, గుర్తుపట్టకుండా గ్లామరస్‌గా మారి, పక్క ఇంట్లోకి దిగుతుంది. చూపు లేని వాడికి సాయం చేస్తున్నట్టు నటిస్తూ అతని లైఫ్ లోకి మళ్ళీ ఎంటర్ అవుతుంది.

Advertisement

చూపు లేని అతన్ని వాడుకుంటూ, అతనికి తెలియకుండానే అతని కూతురిని వేరే వాళ్ళకి అమ్మేయడం, అతనికి ఇచ్చే మందులు మార్చేయడం లాంటివి చేస్తూ నరకం చూపిస్తుంది. తనను మోసం చేసినందుకు వాడిని ముక్కలు ముక్కలుగా విరిచేయాలనే కసితో ఆమె చేసే పనులే ఈ సినిమా క్లైమాక్స్. చివరకు ఆ ప్రేమ కాస్తా పగగా మారి, ఇద్దరి జీవితాలు ఎలా తలకిందులు అయ్యాయనేది చాలా హాట్ అండ్ ఘాటుగా సాగుతుంది.

Read Also : పిజ్జా దొరకకపోతే ప్రాణాలు పోయేలా… ప్రతి పదిహేను నిమిషాలకు మారే వింత

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×