E-Paper
Advertisement

Romantic Series OTT: ఓ వర్షం కురిసిన రాత్రి… ఫ్రెండ్ తమ్ముడితోనే యవ్వారం… ఐయండిబిలో టాప్ రేటింగ్

Romantic Series OTT:  ఓ వర్షం కురిసిన రాత్రి… ఫ్రెండ్ తమ్ముడితోనే యవ్వారం… ఐయండిబిలో టాప్ రేటింగ్
Advertisement

Romantic Series OTT : ఈమధ్య ఎక్కువగా ఎక్కడ చూసినా కొరియన్ సిరీస్ లు దర్శనమిస్తున్నాయి. కొత్తగా ఏ రొమాంటిక్ డ్రామా వచ్చినా, ఎపిసోడ్లు మొత్తం అయ్యేవరకు ఓ చూపు చూడాల్సిందే అన్నట్లు ఉంది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన రొమాంటిక్ సిరీస్ గురించి చెప్పుకుందాం. ఈ సిరీస్ కి ఐయండిబిలో 8కి పైగా రేటింగ్ కూడా ఉంది. తనకంటే చిన్నవాడైన ఫ్రెండ్ తమ్ముని ప్రేమించే ఒక అమ్మాయి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ కొరియన్ రొమాంటిక్ సిరీస్ పేరు ‘సంథింగ్ ఇన్ ది రెయిన్’ (Something in the Rain). దీనికి అహ్న్ పాన్-సియోక్ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో సన్ యే-జిన్, జంగ్ హే-ఇన్ నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ డ్రామా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు ఆడియోతో కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ముప్పై ఏళ్లు దాటినా పెళ్లి కాకుండా, ఆఫీసులో బాసుల వేధింపులతో జిన్-ఆ అనే అమ్మాయి సతమతమవుతూ ఉంటుంది. ఈ సమయంలో తన చిన్నప్పటి ఫ్రెండ్ తమ్ముడు జూన్-హీ అనే కుర్రాడు ఆమెకు ఎదురు పడతాడు. అతను విదేశాల నుంచి తిరిగి వచ్చి, పొగరుగా కాకుండా, పద్ధతిగా ఉంటూ ఈమె వెంట పడతాడు. మొదట్లో వీడు నా తమ్ముడి లాంటోడు కదా అనుకున్నా, అతని చనువు చూసి ఆమె మనసు పారేసుకుంటుంది. ఒక రోజు వర్షంలో ఒకే గొడుగు కింద నస్తున్నప్పుడు ఈ ప్రేమ మరింత బలపడుతుంది. అలా ఒకరికొకరు ఇష్టపడి, లోకానికి తెలియకుండా దొంగచాటుగా ముద్దులు, ముచ్చట్లతో లవ్ ట్రాక్ నడిపిస్తారు.

కట్ చేస్తే వీళ్ళ ప్రేమ విషయం ఇంట్లో తెలిశాక అసలు సినిమా మొదలవుతుంది. ప్రేమ గెలవాలంటే ఇన్ని తిప్పలు పడాలా అనే రేంజ్‌లో సీన్లు ఉంటాయి. మధ్యలో ఈమె పని చేసే ఆఫీసులో కూడా, ఆడవాళ్లను తక్కువ చేసి చూసే బ్యాచ్‌తో ఈమె ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. చివరికి వీళ్ళ ప్రేమకు శుభం కార్డ్ పడుతుందా ? ఆఫీసులో బాసు వేధింపులను ఆమె ఎలా తిప్పికొడుతుంది ? అనే విషయాలను, ఈ రొమాంటిక్  సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : మతిపోగొట్టే మర్డర్ మిస్టరీ… అడ్డంగా బుక్కయ్యే డెలివరీ బాయ్… క్లైమాక్స్ వరకు సాగే థ్రిల్లింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×