E-Paper
Advertisement

నలుగురి మధ్య నలిగిన ప్రేమ… ఒకరి భార్యపై మరొకరి కన్ను… ఒంటరిగా చూడాల్సిన సినిమా

నలుగురి మధ్య నలిగిన ప్రేమ… ఒకరి భార్యపై మరొకరి కన్ను… ఒంటరిగా చూడాల్సిన సినిమా
Advertisement

Romantic Movie OTT : రొమాంటిక్ అనే మాట వినబడితే చాలు కొంత మందికి నరాలు జివ్వుమంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటి ఆడియన్స్ కోసమే. బోల్డ్ కంటెంట్ బాగానే ఉంటుంది ఇందులో. ఈ సినిమా రెండు జంటల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ మధ్య తలెత్తే వివాహేతర సంబంధాలు, నమ్మకద్రోహం, ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో వచ్చే మార్పులను ఇందులో చూపించారు. ఈ సినిమా పెద్దలకు మాత్రమే, అదికూడా ఒంటరిగా చూడటం మంచిది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ మూవీ పేరు ‘మై నైబర్స్ వైఫ్’ (My Neighbor’s Wife). 2011 లో వచ్చిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు జున్ లానా దర్శకత్వం వహించారు. ఇది ఆయన దర్శకత్వంలో వచ్చిన 6వ సినిమా. ఇందులో డెన్నిస్ త్రిల్లో, లోవి పోయె, జేక్ కుయెంకా కార్లా అబెల్లానా లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రం అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ఫిలిప్పీన్స్‌లో పలు అవార్డులకు కూడా నామినేట్ అయ్యింది. యూట్యూబ్ (YouTube): Regal Entertainment ఛానెల్‌లో ఈ సినిమా పూర్తి వెర్షన్ ఉచితంగా అందుబాటులో ఉంది. అలాగే నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో కూడా ఈ సినిమాను చూడవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథలో ఇద్దరు జంటలు ఉంటారు. ఒకరు బుల్లెట్, జాస్మిన్; ఇంకొకరు ఆరోన్, గిసెల్. వీళ్లంతా ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్లే. అయితే ఒకరోజు రాత్రి మందు పార్టీలో మత్తులో ఉన్న బుల్లెట్, తన స్నేహితుడి భార్య అయిన గిసెల్‌తో కలిసి తప్పు చేస్తాడు. ఈ విషయం కాస్తా బయటపడటంతో ఇద్దరి కాపురాల్లో చిచ్చు రేగుతుంది. నమ్మిన వాళ్లే ఇలా వెన్నుపోటు పొడవడంతో గొడవలు మొదలవుతాయి. తమ భర్త, స్నేహితురాలు కలిసి చేసిన మోసాన్ని భరించలేకపోయిన జాస్మిన్, దానికి ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది. కోపంతో ఆమె కూడా గిసెల్ భర్త అయిన ఆరోన్‌తో సంబంధం పెట్టుకుంటుంది.

నువ్వు ఒకరి పెళ్లాంతో వెళ్తే, నేను ఇంకొకరి మొగుడితో వెళ్తా అన్నట్టుగా వ్యవహారం తయారవుతుంది. దీనివల్ల ఆ రెండు జంటల మధ్య ఉన్న బంధం పూర్తిగా దెబ్బతిని, ఒకరినొకరు అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. చివరికి ఈ అక్రమ సంబంధాలు, గొడవల వల్ల ఎవరికీ సుఖం దక్కదు. నమ్మకం పోయాక సంసారం చేయడం ఎంత నరకమో ఈ సినిమా చూపిస్తుంది. చివరికి వీళ్ళు చేసిన తప్పులకి పశ్చాత్తాపం పడతారా ? కలసి ఉంటారా ? విడిపోతారా ? అనే విషయాలను మాత్రం ఈ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  ఖాకీలకే ముప్పుతిప్పలు పెట్టే కేసు… మూడు సీజన్లతో 7.9 ఐయండిబి రేటింగ్… నిజంగానే తోపు సిరీస్ మావా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×