E-Paper
Advertisement

ఖతర్నాక్ గల్లీ… ఇక్కడ సెటిల్మెంట్లు లేవు.. కేవలం సెంటిమెంట్లు మాత్రమే

ఖతర్నాక్ గల్లీ… ఇక్కడ సెటిల్మెంట్లు లేవు.. కేవలం సెంటిమెంట్లు మాత్రమే
Advertisement

Romantic movie OTT : కమర్షియల్ హంగులతో సోషల్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు గత ఏడాది వచ్చిన ఒక సినిమాలో. ఈ బాలీవుడ్ సినిమా వేరు మతాలకు చెందిన ప్రేమ కథతో మొదలవుతుంది. మొదట సరదాగా వెళ్ళే ఈ కథ, రాను రాను క్రైమ్ ఎలిమెంట్స్ తో ఉత్కంఠ పెంచుతుంది. ఈ సినిమాకి ఐయండిబిలో 8.7 రేటింగ్ కూడా ఉంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎక్కడ చూడచ్చు అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎక్కడ చూడచ్చు అంటే

2025లో హోలీ పండుగకు వచ్చిన ఈ సినిమా పేరు ‘ఇన్ గలియోన్ మే’ (Inn Galiyon Mein). ఈ సినిమాకు అవినాష్ దాస్ దర్శకత్వం వహించారు. పునర్వసు ఈ సినిమాకు కథను అందించారు. ‘యదునాథ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై వినోద్, నీరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు జావేద్ జాఫ్రీ ఒక కీలక పాత్రలో నటించారు. ఆయనతో పాటు వివాన్ షా (నసీరుద్దీన్ షా కుమారుడు), అవంతిక దస్సాని (నటి భాగ్యశ్రీ కుమార్తె) హీరో హీరోయిన్లుగా నటించారు. అలాగే సుశాంత్ సింగ్, ఇష్తియాక్ ఖాన్ వంటి పవర్‌ఫుల్ నటులు కూడా ఉన్నారు. ఇక బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అమ్మాళ్ మాలిక్తో పాటు సౌరభ్ ఖాల్సి, అరవింద్ సగోలే ఈ సినిమాకు పాటలు అందించారు. ఈ సినిమా ఇంకా డిజిటల్ స్ట్రీమింగ్ లోకి రాలేదు. అయితే తొందర్లోనే  ఈ సినిమా Zee5, Jio hotstar వంటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లక్నోలోని పాతబస్తీలో ఉండే రెండు వీధుల కథ ఇది. ఒక వీధిలో హిందువులు, మరో వీధిలో ముస్లింలు ఎంతో కాలంగా కలిసిమెలిసి ఉంటారు. అక్కడ కూరగాయలు అమ్ముకునే హరియా (వివాన్ షా), పక్కింటి షబ్బో (అవంతిక దాసాని) ఒకరినొకరు ఇష్టపడతారు. ఆ ఊర్లో టీ కొట్టు నడిపే మీర్జా చాచా (జావేద్ జాఫేరి) అందరినీ కలిపి ఉంచుతూ, ఆ రెండు వీధుల మధ్య ఒక వారధిలా ఉంటాడు. ఈ గల్లీల్లో ఉండే మనుషుల మధ్య ప్రేమ, స్నేహం చుట్టూ కథ చాలా సరదాగా సాగిపోతుంటుంది. కానీ ఒక రాజకీయ నాయకుడు తన స్వార్థం కోసం ఈ రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తాడు. అందుకు హరియా, షబ్బోల ప్రేమను పావుగా వాడుకుంటాడు. ఇక సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ, ఎంతో కాలంగా ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు. ఈ కుట్రల వల్ల హరియా, షబ్బోల ప్రేమకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? సోషల్ మీడియా మాయలో నుంచి ఆ ఊరి జనం బయటపడ్డారా ? అనేదే మిగతా కథ.

Read Also :  ఫార్మా కంపెనీల మాయ… లెక్కే లేని పేదోడి ప్రాణం… దిమ్మ తిరిగే దారుణాలు

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×