E-Paper
Advertisement

పెళ్ళి రోజే మరొకరిని ఇష్టపడే పెళ్లి కూతురు… భర్తకు దిమ్మతిరిగే షాక్… క్లైమాక్స్ క్రేజీగా

పెళ్ళి రోజే మరొకరిని ఇష్టపడే పెళ్లి కూతురు… భర్తకు దిమ్మతిరిగే షాక్… క్లైమాక్స్ క్రేజీగా
Advertisement

Romantic Movie OTT : ప్రేమ ఎవరిమీద ఎప్పుడు ఎలా పుడుతుందో అస్సలు చెప్పలేం. ఏ వయసులో అయినా ఎప్పుడైనా పుడుతుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో ప్రేమ పెళ్లి రోజే వేరొకరితో పుడుతుంది. ఒక పక్క పెళ్లి జరుగుతుంటే, మరో పక్క పెళ్లి కూతురు ఒక పూల డెకరేషన్ అమ్మాయితో ప్రేమలో పడుతుంది. ఒక అమ్మాయి, మరొక అమ్మాయిని ప్రేమించడం ఏమిటనుకుంటున్నారా ? అయితే మరిన్ని విషయాల కోసం కథలోకి వెళ్దాం పదండి.

ఎక్కడ చూడచ్చు అంటే

2005లో వచ్చిన ఈ బ్రిటిష్ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘ఇమాజిన్ మీ & యు’ (Imagine Me & You). ఓల్ పార్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో రాచెల్ పాత్రలో నటించిన పైపర్ పెరాబో అమెరికన్ నటి కాగా, మిగిలిన ప్రధాన తారాగణం అంతా బ్రిటీష్ వాళ్ళే కావడం విశేషం. ఈ సినిమా నిడివి దాదాపు 94 నిమిషాలు ఉంటుంది. దీనికి అలెక్స్ హెఫ్స్ సంగీతం అందించగా, బెన్ డేవిస్ ఛాయాగ్రహణం నిర్వహించారు. 2007లో GLAAD మీడియా అవార్డ్స్‌లో ఈ సినిమా ‘ఉత్తమ చిత్రం’ కేటగిరీలో నామినేషన్ పొందింది. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

రాచెల్ అనే అమ్మాయికి తన చిన్ననాటి ఫ్రెండ్ హెక్టర్‌తో పెళ్లి జరుగుతుంటుంది. అందరూ హ్యాపీగా ఉన్న టైమ్‌లో, పెళ్లి పీటల మీద ఉన్న రాచెల్ కళ్లు అనుకోకుండా అక్కడ పూల డెకరేషన్ చేస్తున్న లూస్ అనే అమ్మాయి మీద పడతాయి. ఆ ఒక్క చూపుతోనే రాచెల్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. పెళ్లయ్యాక కూడా ఆ లూస్ ధ్యాస రాచెల్‌ను అస్సలు వదలదు. అప్పటిదాకా తన మొగుడిని ప్రేమిస్తున్నాననుకున్న రాచెల్‌కు, అసలైన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో ఆ అమ్మాయిని చూశాకే అర్థమవుతుంది. ఇక రాచెల్ ఆ లూస్‌తో మెల్లగా తిరగడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో లూస్ ఒక లెస్బియన్ అని రాచెల్‌కు తెలుస్తుంది.

అయితే రాచెల్ భర్త హెక్టర్ చాలా మంచోడు, కానీ లోపల మాత్రం లూస్ మీద పిచ్చి ప్రేమ పుడుతుంటుంది. అటు మొగుడిని మోసం చేయలేక, ఇటు తన మనసులో ఉన్న కొత్త ఫీలింగ్‌ని ఆపుకోలేక రాచెల్ కి పిచ్చెక్కిపోతుంది. తను మగవాళ్లని ఇష్టపడుతుందా లేక ఆడవాళ్లనా అనే కన్ఫ్యూజన్‌లో పడిపోయి సతమతమవుతుంది. చివరికి రాచెల్ తన మనసు మాట వినడమే కరెక్ట్ అని డిసైడ్ అవుతుంది. హెక్టర్ కూడా రాచెల్ బాధను అర్థం చేసుకుని, ఆమె సంతోషం కోసం తనే తప్పుకుంటాడు. ఇక రాచెల్ తన పాత జీవితాన్ని వదిలేసి, వర్షంలో పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రాఫిక్ జామ్‌లో ఉన్న లూస్‌ని కలుస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకుని తమ ప్రేమను గెలిపించుకోవడంతో ఈ కథకు శుభం కార్డ్ పడుతుంది.

Advertisement

Read Also : మాఫియా డాన్ల మధ్య మొదలయ్యే వేట… ఆఖరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టించేలా చేసే సినిమా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×