// // Romantic Movie OTT : ప్రతి ఉదయం ఒక కొత్త పరిచయం... -->
E-Paper
Advertisement

Romantic Movie OTT : ప్రతి ఉదయం ఒక కొత్త పరిచయం… గతం మరిచే ప్రియురాలి కోసం ప్రియుడి తపన… మళ్లీ మళ్లీ మొదలయ్యే ప్రేమ

Romantic Movie OTT : ప్రతి ఉదయం ఒక కొత్త పరిచయం… గతం మరిచే ప్రియురాలి కోసం ప్రియుడి తపన… మళ్లీ మళ్లీ మొదలయ్యే  ప్రేమ
Advertisement

Romantic Movie OTT : ఎమోషనల్‌గా సాగే అద్భుతమయిన ప్రేమ కథతో ఒక కొరియన్ మూవీ థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమా వతీతలో కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. హై స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ లవ్ స్టోరీలో విజువల్స్ పక్కా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. క్లైమాక్స్ మాత్రం మీతో కన్నీళ్లు పెట్టించడం గ్యారెంటీ. లవర్స్ అయితే ఈ సినిమాను మిస్ కాకూడదు. ఎందుకంటే ఈ సినిమా అంత బాగా మనసుకు హత్తుకుంటుంది. కథ కూడా ఈ సినిమా విజయంలో కీలకం అయింది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ కొరియన్ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసప్పియర్స్ టునైట్’ (Even If This Love Disappears Tonight). కిమ్ హ్యే-యంగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో షిన్ సి-ఆ, చూ యంగ్-వూ నటించారు. ఈ సినిమా 2025 డిసెంబర్ 24న కొరియా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అక్కడ దాదాపు 8 లక్షల మందికి పైగా ప్రేక్షకులు ఈ సినిమాను చూశారు. 2026 ఫిబ్రవరి 3న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కు వచ్చింది. హీరోయిన్ షిన్ సి-ఆ (‘ద విచ్ 2’ ఫేమ్) ఈ రోల్ కోసం బాగానే కష్టపడింది. హీరోగా చూ యంగ్-వూ తన లుక్ అండ్ ఎమోషనల్ యాక్టింగ్‌తో అమ్మాయిల గుండెల్లో నిలిచిపోయాడు కూడా. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ పక్కా నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.

స్టోరీ ఏంటంటే

Advertisement

ఇందులో హీరోయిన్ ఒక వింత జబ్బుతో కొట్టుమిట్టాడుతుంటుంది. అదేంటంటే, రాత్రి పడుకొని పొద్దున్నే లేచేసరికి నిన్నటి విషయాలు మెదడులోంచి డిలీట్ అయిపోతాయి. పాపం ఆ అమ్మాయికి ఈరోజు ఏం జరిగిందో రేపు అస్సలు గుర్తుండదు. అందుకే ప్రతిరోజూ ఒక డైరీలో రాసుకుంటూ, పొద్దున్నే దాన్ని చదివి అసలు తను ఎవరో, తన చుట్టూ ఉన్నోళ్లు ఎవరో తెలుసుకుంటుంది. ఈ లోపు మన హీరో ఎంట్రీ ఇస్తాడు. వాడు కూడా మామూలోడు కాదు, వాడికి గుండె జబ్బు ఉండి చావుతో కుస్తీ పడుతుంటాడు. వీళ్లిద్దరికీ ఒకరి మీద ఒకరికి పిచ్చి ప్రేమ పుడుతుంది. ప్రతిరోజూ హీరోయిన్ తనని మర్చిపోతున్నా, హీరో మాత్రం తగ్గకుండా మళ్ళీ మళ్ళీ ఆమెకు లైన్ వేస్తూ, కొత్తగా పరిచయం చేసుకుంటూ ఆమె మనసు గెలుచుకుంటాడు.

హీరోయిన్ కూడా అతని పద్ధతి చూసి, ప్రతిరోజూ కొత్తగా వాడితో మళ్ళీ ప్రేమలో పడిపోతుంది. చూసేవాళ్లకు వీళ్లది ఒక పిచ్చి ప్రేమ లాగా, గమ్మత్తుగా అనిపిస్తుంది. వాళ్ల లోకంలో వాళ్లు రోజూ ఒక కొత్త యుద్ధం చేస్తూ ప్రేమను కాపాడుకుంటారు. కానీ క్లైమాక్స్ మాత్రం గుండెను పిండేస్తుంది. హీరోకి ఉన్న జబ్బు వల్ల అతను చనిపోతాడు. తను చనిపోయిన విషయం తెలిస్తే హీరోయిన్ తట్టుకోలేదని, చనిపోయే ముందు హీరో ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఏమిటి ? హీరోయిన్ కి హీరో చనిపోయిన విషయం తెలుస్తుందా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ కొరియన్ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : చలి జ్వరం తెప్పించే చేతబడి … వణికించే క్షుద్రపూజలతో ప్యాంట్లు తడిపించే ఈ సినిమాలు ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×