E-Paper
Advertisement

Romantic Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న వెండితెర అద్భుతం… గుండెలను హత్తుకునేలా సిద్ధాంత్-మృణాల్ లవ్ స్టోరీ.. ఎప్పుడు ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Romantic Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న వెండితెర అద్భుతం… గుండెలను హత్తుకునేలా సిద్ధాంత్-మృణాల్ లవ్ స్టోరీ.. ఎప్పుడు ఎక్కడ చూడచ్చో తెలుసా ?
Advertisement

Romantic Movie OTT : చాలా ప్రేమ కథలు ఓటీటీలోకి వస్తున్నాయి. ఒక్కో సినిమా, ఒక్కో స్టైల్ చూపిస్తుంటుంది. అయితే రీసెంట్ గా వచ్చిన బాలీవుడ్ ప్రేమ కథ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ హీరో, హెరోయిన్ల కెమిస్ట్రీ హార్ట్ ని టచ్ చేస్తుంది. ఈ సినిమాలో ఊహించని మలుపులు ఉండవు. కానీ కథ నడిచే సమయంలో అలా చూస్తూ ఉండిపోతారు. ఒక మంచి ఫీల్ ను ఇస్తుంది ఈ సినిమా. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని పలకరించబోతోంది. ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి రాబోతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ 

సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ రొమాంటిక్ డ్రామా పేరు ‘దో దీవానే షెహర్ మే’ (Do Deewane Seher Mein). రవి ఉద్యావర్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. 2026 ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సంజయ్ లీలా భన్సాలీ నిర్మించారు. ఈ సినిమా నిడివి సుమారు 2 గంటల 17 నిమిషాలు ఉంటుంది. ఈ చిత్రాన్ని సుమారు ₹30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. April 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. సమ్మర్ లో కూల్ గా ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయండి. .

స్టోరీ ఏమిటంటే

Advertisement

శశాంక్ (సిద్దాంత్ చతుర్వేది) ఓ ఎలక్ట్రానిక్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. అతనిలో అంతా బాగానే ఉన్నా కొంచెం నత్తి ఉంటుంది. ఈ లోపంతో కొన్ని కార్యక్రమాలకి దూరంగా ఉంటాడు. నలుగురిలో కూడా మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటాడు. ఆఫీస్ లో కూడా ఇదే పరిస్థితి, టాలెంట్ ఉన్నా ఈ లోపం అతన్ని కొంచెం బాధపెడుతుంటుంది. మరోవైపు ముంబైలో ఉండే రోష్ని (మృణాల్ ఠాకూర్) కి కూడా ఇలాంటి వింత సమస్య తో భయపడుతుంటుంది. ఆమె అందంగా లేననే ఫీలింగ్ లోఉంటుంది. అలాంటి లోపాలున్న వీళ్ళు ఒక రోజు ఎదురు పడతారు. మొదట మాటలు, కుదిరితే కప్పు కాఫీ ఇలా సాగిపోతూ ప్రేమలో కూడా పడతారు. ఈ విషయం పెద్దలకు కూడా తెలుస్తుంది. వీళ్ళ ప్రేమ ఏమవుతుంది ? పెద్దలు ఒప్పుకుంటారా ? వీళ్ళ లోపాల వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also :  తెలివితేటలతో హైలెట్ అయ్యే తీర్పులు… రెండేళ్లుగా టాప్ ట్రెండింగ్ లో లీగల్ డ్రామా… ఐయండిబిలో 8 రేటింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×