E-Paper
Advertisement

కుర్రాడితో ప్రేమలో పడే స్కూల్ హెడ్‌ మిస్ట్రెస్… ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ

కుర్రాడితో ప్రేమలో పడే స్కూల్ హెడ్‌ మిస్ట్రెస్… ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ
Advertisement

Romantic Movie OTT :రొమాంటిక్ డ్రామాలు అందరినీ అలరిస్తుంటాయి. అయితే హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలు ఇచ్చే కిక్ వేరు. ప్రేమ కథతో పాటు బోల్డ్ కంటెంట్ కూడా బాగానే ఉంటుంది. ఇలాంటి సినిమాలను కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటారు కొంత మంది అభిమానులు. అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా. అయితే ఇది మరీ అంత బోల్డ్ కంటెంట్ కాదు. కానీ అక్కడక్కడా మసాలా ఘాటు తగులుతూనే ఉంటుంది. ఇది ముగ్గురు అడోళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఫస్టాఫ్ అంతా ఆ ముగ్గురు ఆడోళ్లు మందు కొడుతూ, జోకులు వేసుకుంటూ, ఎంజాయ్ చేసే సీన్లతో సరదాగా సాగిపోతుంది. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి అసూయతో ఒకరి జీవితాన్ని ఒకరు ఎలా నాశనం చేసుకుంటారో చూపించే హార్డ్ హిట్టింగ్ డ్రామా ఇది. సినిమా మొదలైనప్పుడు నవ్వుకున్నా, అయిపోయేసరికి మాత్రం భారమైన మనసుతో బయటికి వస్తాం.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ బ్రిటిష్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘క్రష్’ (Crush). 2001లో వచ్చిన ఈ సినిమాకు జాన్ మెక్‌కే దర్శకత్వం వహించారు.
ఇందులో ఆండీ మెక్‌డోవెల్, ఇమెల్డా స్టాంటన్, అన్నా ఛాన్సలర్, కెన్నీ డౌటీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా స్క్రిప్ట్ రాసినప్పుడు డైరెక్టర్ తన రియల్ లైఫ్ స్నేహితులైన లేడీ డాక్టర్లను చూసి ఇన్‌స్పైర్ అయ్యాడట. వాళ్లు కూడా వీకెండ్ లో మందు కొడుతూ తమ కష్టసుఖాలు చెప్పుకునేవారట. అందుకే సినిమాలో ఆ సీన్లు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఇక ఆండీ మెక్‌డోవెల్ లాంటి హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇంత చిన్న బడ్జెట్ సినిమాలో నటించడం అప్పట్లో ఒక పెద్ద విశేషం. ఆమెకు కథ బాగా నచ్చడంతో రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలా తగ్గించుకుని మరీ ఈ ప్రాజెక్ట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా సగం వరకు నవ్వుపుట్టించే కామెడీగా ఉండి, ఒక్కసారిగా సీరియస్ డ్రామాగా మారిపోవడం చాలామందికి రుచించలేదు. అందుకే ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ మహిళా ప్రేక్షకుల్లో మాత్రం ఈ కాన్సెప్ట్ బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా plex, Mubi ఓటీటీలలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక ఊరిలో ముగ్గురు మహిళలు ఉంటారు. ఒకరు స్కూల్ హెడ్ మిస్ట్రెస్, ఒకరు పోలీస్, ఇంకొకరు ఆర్టిస్ట్. ఈ ముగ్గురికీ పెళ్లిళ్లు కాక, మొగుళ్లు లేక అల్లాడిపోతుంటారు. అందుకే వారానికి ఒకసారి మందు సిట్టింగ్ వేసి, తమ గోడును ఒకరికొకరు చెప్పుకుంటూ బాధపడుతుంటారు. ఈ బ్యాచ్‌లో హెడ్ మాస్టర్ కేట్ ఒకరోజు తన పాత స్టూడెంట్ జెడ్ అనే కుర్రాడిని చూసి పడిపోతుంది. అతనికేమో పాతికేళ్లు, ఈమె ఏమో 40కి దగ్గరలో ఉంటుంది. అయినా సరే, వయసుని పక్కనపెట్టి అతనితో ఘాటుగా ప్రేమాయణం మొదలుపెడుతుంది.

ఇది చూసి మిగతా ఇద్దరు స్నేహితులకు ఎక్కడలేని మంట పుడుతుంది. ఆ కుర్రాడు ఏదో మోసం చేస్తున్నాడని, వాళ్ల స్నేహితురాలిని కాపాడాలనే నెపంతో పనికట్టుకుని మరీ వాళ్ల ప్రేమను చెడగొట్టడానికి ప్లాన్లు వేస్తారు. ఈ క్రమంలో ఈ ముగ్గురి మధ్య గొడవలు మొదలై, ఒక్కడి కోసం ప్రాణస్నేహితులు కాస్తా శత్రువుల్లా మారిపోతారు. ఆ కుర్రాడు నిజంగానే కేట్‌ను ఇష్టపడతాడు కానీ, స్నేహితురాళ్ల అతి జోక్యం వల్ల ఆ బంధం కాస్తా రచ్చరచ్చ అవుతుంది. కామెడీగా మొదలైన ఈ కథ కాస్తా ఎమోషనల్ డ్రామాగా మారిపోతుంది. చివరికి ఆ ప్రేమ గెలిచిందా లేదా అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : ఆమె కౌగిలిలో చిక్కితే ప్రాణాలు గాల్లోనే… ఈ సినిమా సింగిల్స్ కి మాత్రమే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×