E-Paper
Advertisement

Romantic Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రభాస్ మెచ్చిన సినిమా… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే

Romantic Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రభాస్ మెచ్చిన సినిమా… ఎప్పుడు ఎక్కడ చూడచ్చు అంటే
Advertisement

Romantic Movie OTT : మ్యాడ్ సినిమాతో అందరి మనసు దోచిన నటుడు సంతోష్ శోభన్. లేటెస్ట్ గా ఈ హీరో గారు ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే కామెడీ సినిమాతో సందడి చేశారు. ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజు థియేటర్లలో అడుగు పెట్టిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను పలకరించడానికి సిద్ధమైంది. మొదట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. అయితే ప్రభాస్ లాంటి హీరో ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో సినిమా కొంతమేర జోష్ అందుకుని, బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ ధరకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. మరి ఈ సినిమాను ఎప్పుడు, ఎక్కడ చూడచ్చో తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

అశ్విని చంద్రశేఖర్ దర్శకత్వం లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly). ఈ సినిమాలో సంతోష్ శోభన్, మానసా వారణాసి జంటగా నటించిన ఈ సినిమా నెల లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇది 2026 ఫిబ్రవరి 14న థియేటర్ లలోకి రాగా, 2026 మార్చి 13 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ తెలుగు సినిమా, తమిళంలో కూడా స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ఆదిత్య రవీంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా… యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా, ఈ ఓటీటీ డీల్ తో నిర్మాతలు కూడా సేఫ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఆన్‌లైన్‌లో చూసి ఎంటర్టైన్ అవ్వచ్చు .

స్టోరీ ఏంటంటే?

Advertisement

శివ (సంతోష్ శోభన్) చెన్నైలో బైక్ టాక్సీ నడుపుతూ సాదాసీదా జీవితం గడుపుతుంటాడు. నిజానికి అతను ఒక ఇంటీరియర్ డిజైనర్. అయితే సరైన ఉద్యోగం దొరక్క బతకడానికి ఈ పని చేస్తుంటాడు. అయితే ఈ సమయంలో ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న మిత్ర (మానస వారణాసి) అనే అమ్మాయి, శివ బైక్‌ ను బుక్ చేసుకుంటుంది. అలా వారిద్దరి మధ్య మొదలైన పరిచయం, ప్రయాణంలో చెప్పుకునే కబుర్ల ద్వారా మెల్లగా ప్రేమగా మారుతుంది. కొద్ది రోజుల్లోనే ఒకే ఇంట్లో ఉంటూ, పెళ్లికి ముందే లివిన్ రిలేషన్‌ పెట్టుకుంటారు.

మరోవైపు ఇంటి దగ్గర మిత్ర పేరెంట్స్ పెళ్లి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే అనుకోకుండా వీళ్ళ విషయం మిత్ర ఇంట్లో తెలిసిపోతుంది. దీంతో స్టోరీ మలుపులు తిరుగుతుంది. చివరికి వీళ్ళ ప్రేమ కథ ఎంత వరకు వెళ్తుంది ? మిత్ర పేరెంట్స్, ఒక బైక్ టాక్సీ నడిపే వాడికి పిల్లను ఇస్తారా ? ఈ కథకు ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : పొదుపు పేరుతో పాడు పని… మొగుళ్ళను కాదని మరొకరితో… ఈ సినిమా పెద్దలకు మాత్రమే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×