E-Paper
Advertisement

Romantic fantasy Drama : ప్రేమ కథలో విస్తుపోయే క్లైమాక్స్… వయసు పెరిగినా తగ్గని తగ్గని జోరు… ఆస్కార్ విన్నింగ్ మూవీ

Romantic fantasy Drama : ప్రేమ కథలో విస్తుపోయే క్లైమాక్స్… వయసు పెరిగినా తగ్గని తగ్గని జోరు… ఆస్కార్ విన్నింగ్ మూవీ
Advertisement

Romantic fantasy Drama : ఎన్నో రకాల ప్రేమ కథలు ఓటీటీలో స్ట్రీమింగ్ లో ఉన్నాయి. అయితే కొన్ని ప్రేమకథలు మర్చిపోవడం అంత సులభం కాదు. కంటెంట్ వల్ల అయినా కావచ్చు, నటీనటుల వల్ల కూడా కావచ్చు, దర్శకుడు ప్రతిభ కూడా ఉండొచ్చు. ఈ సినిమాలు, మళ్లీ మళ్లీ చూడాలనిపించే విధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వచ్చి న ఒక హాలీవుడ్ ప్రేమ కథ గురించి చెప్పుకోవాల్సిందే. మూడు ఆస్కార్లు కూడా ఈ సినిమా గెలిచింది. ఈ సినిమాలో అంతగా ఏముంది ? దీని పేరు ఏమిటి? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో చూడచ్చు ?

ఈ రొమాంటిక్ ఫాంటసీ మూవీ పేరు ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్’ (The Curious Case of Benjamin Button). ఇది 1922లో ఎఫ్. స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్ రాసిన చిన్న కథ ఆధారంగా రూపొందింది. డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో బ్రాడ్ పిట్, కేట్ బ్లాంచెట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2008లో 13 ఆస్కార్ నామినేషన్లను పొంది, మూడు అవార్డులను (బెస్ట్ మేకప్, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ డైరెక్షన్) గెలుచుకుంది. ఇది ప్రస్తుతం 7.8 ఐయండిబి రేటింగ్ తో Amazon Prime Video ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పుట్టడమే ఒక వింతగా పుడతాడు బెంజమిన్ అనే పిల్లాడు. సాధారణంగా ఎవరైనా చిన్న పిల్లల్లా పుట్టి ముసలివారు అవుతారు. కానీ వీడు మాత్రం 80 ఏళ్ల ముసలి ప్రాణంలా, ముడతలు పడిన శరీరంతో పుడతాడు. ఆ రూపాన్ని చూసి తండ్రి భయపడి ఒక వృద్ధాశ్రమం దగ్గర వదిలేస్తే, అక్కడ ఉండే ఒక నన్ అతన్ని తన బిడ్డలా పెంచుతుంది. కాలం గడిచేకొద్దీ బెంజమిన్ వయసు వెనక్కి వెళ్తుంటుంది. అంటే రోజురోజుకూ అతను యవ్వనంగా మారుతుంటాడు.

ఆ క్రమంలోనే డైసీ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు బెంజమిన్. వాళ్ళిద్దరి వయసు ఒకేలా ఉన్నప్పుడు కొంతకాలం చాలా సంతోషంగా కూడా గడుపుతారు. కానీ రోజులు గడిచే కొద్దీ డైసీ ముసలిది అవుతుంటే, బెంజమిన్ మాత్రం చిన్న పిల్లాడిగా మారిపోతుంటాడు. తన వల్ల డైసీకి ఇబ్బంది కలగకూడదని అతను ఆమెకు దూరంగా వెళ్లిపోతాడు. చివరికి డైసీ వీళ్ళ ప్రేమ ఏమవుతుంది ? ఈ కథకు ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకొనాల్సిందే.

Advertisement

Read Also : పొదుపు పేరుతో పాడు పని… మొగుళ్ళను కాదని మరొకరితో… ఈ సినిమా పెద్దలకు మాత్రమే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×