E-Paper
Advertisement

Romantic Drama OTT : లవర్ ను బాస్ తో గడపమనే ప్రియుడు… ఊహించని షాక్ ఇచ్చే ప్రియురాలు… కళ్లు చెదిరే క్లైమాక్స్

Romantic Drama OTT : లవర్ ను బాస్ తో గడపమనే ప్రియుడు… ఊహించని షాక్ ఇచ్చే ప్రియురాలు… కళ్లు చెదిరే క్లైమాక్స్
Advertisement

Romantic Drama OTT : ఓటీటీలో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే సినిమాలకి ఓటీటీ ఒక వేదికగా మారింది. ఇక వీటిలో రొమాంటిక్ సినిమాలకి వీరాభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో కొంచెం బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక మెసేజ్ కూడా ఇస్తుంది ఈ సినిమా. పల్లెటూరి నుంచి సిటీకి వెళ్ళే ఒక ప్రేమ జంట చుట్టూ కథ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ప్రేమ జంట కాస్తా పనికిమాలిన జంటగా మారుతారు. సిటీ లైఫ్ స్టైల్ కి, రంగుల ప్రపంచానికి అలవాటు పడితే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ ఫిలిప్పీన్స్ రొమాంటిక్ సినిమా పేరు ‘సుగప’ (Sugapa). ఇందులో ఏజే రావెల్ (అనా), అల్జూర్ అబ్రెనికా (బెన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ అయిన ఏజే రావెల్, అల్జూర్ అబ్రెనికా నిజ జీవితంలో కూడా జంట కావడంతో, వీరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక ఫిలిప్పీన్స్ సినిమా రంగంలో బోల్డ్ సినిమాలకు పేరుగాంచిన లారెన్స్ ఫజార్డో దీనికి దర్శకత్వం వహించారు. సిటీలో అమ్మాయిలు ఎలా మోసపోతారో ఇందులో ఆయన చాలా పచ్చిగా చూపించారు. ఈ చిత్రాన్ని వివా ఫిలిమ్స్ (Viva Films) నిర్మించింది. ఇది ఫిలిప్పీన్స్‌లో అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటి. ఇది 2023 ఆగస్టు 25న Vivamax ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అనా, బెన్ అనే ఇద్దరు ప్రేమికులు తమ పల్లెటూరి జీవితాన్ని వదిలి, మంచి భవిష్యత్తు కోసం నగరానికి వస్తారు. పట్నంలో కష్టపడి పని చేసి, డబ్బు సంపాదించి గొప్పగా బతకాలని కలలు కంటారు. కానీ నగరం వాళ్ళకు అనుకున్నంత సులభంగా స్వాగతం పలకదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఆకలి, అవసరాలు వాళ్ళను క్రమంగా తప్పుడు దారుల వైపు నడిపిస్తాయి. బెన్ డ్రైవర్‌గా పని చేస్తూ, అనా ఒక బ్యూటీ సెలూన్‌లో పని చేస్తూ ఇద్దరూ కలిసి హ్యాపీగా జీవితం సాగిస్తారు. అయితే నగర జీవితం వాళ్లను నెమ్మదిగా మార్చేస్తుంది. డబ్బు కోసం అనా ఒక రిచ్ బిజినెస్‌మ్యాన్‌తో సంబంధం పెట్టుకుంటుంది. బెన్ కూడా డ్రగ్స్‌కి అలవాటు పడి, డబ్బు సంపాదన కోసం తప్పుడు మార్గాలు ఎంచుకుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమ నెమ్మదిగా చీలిపోతుంది. ఒకానొక సమయంలో అనా ప్రైవేట్ వీడియోలు . అమ్మకానికి వెళతాయి. దీంతో కథ మరిన్ని మలుపులు తిరుగుతుంది. చివరికి వీళ్ళ జీవితాలు ఎటు వెళతాయి ? ఆమె వీడియోలు లీక్ చేసింది ఎవరు ? ఈ కథకు ముగింపు ఏంటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : తండ్రి కర్మకాండలో కలిసిన స్నేహం… ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న మరాఠి ప్రేమకథ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×