// // Romantic Drama OTT: తండ్రి కర్మకాండలో కలిసిన స్నేహం... -->
E-Paper
Advertisement

Romantic Drama OTT: తండ్రి కర్మకాండలో కలిసిన స్నేహం… ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న మరాఠి ప్రేమకథ

Romantic Drama OTT: తండ్రి కర్మకాండలో కలిసిన స్నేహం… ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న మరాఠి ప్రేమకథ
Advertisement

Romantic Drama OTT : ప్రేమ, విరహం నేపథ్యంలో సాగే మనసుకు హత్తుకునే కథ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మరాఠీ సినిమా, మహారాష్ట్రలోని ఒక గ్రామం నేపథ్యంలో సాగుతుంది. తండ్రి మరణానికి సంతాపం తెలుపడానికి తన గ్రామానికి వచ్చిన ఆనంద్ అనే 30 ఏళ్ల వ్యక్తి చుట్టూ ఈ కథఉంటుంది. అక్కడ ఒక ప్రేమ కథ మొదలవుతుంది. అయితే ఆ ప్రేమ మరో ఆబ్బాయితో ఉంటుంది. గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో మంచి గుర్తింపు వస్తోంది.

నెట్ ఫ్లిక్స్ (netflix)లో స్ట్రీమింగ్

ఈ మరాఠీ రొమాంటిక్ డ్రామా పేరు ‘సబర్ బోండా’ (Sabar Bonda), దీనిని ఆంగ్లంలో Cactus Pears అని కూడా పిలుస్తారు. ఈ చిత్రానికి రోహన్ పరశురామ్ కనవాడె దర్శకత్వం వహించారు. ఇది ఆయన మొదటి ఫీచర్ ఫిల్మ్. పూణేకు చెందిన అనన్య క్రియేషన్స్, మౌంటెన్ రివర్ ఫిలిమ్స్ కలిసి దీనిని నిర్మించాయి. అమెరికాలో జరిగిన సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (2025) లో ఈ సినిమా ‘వరల్డ్ సినిమా డ్రామాటిక్’ విభాగంలో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ గెలుచుకుంది. ఒక మరాఠీ సినిమాకు ఇంతటి గౌరవం దక్కడం ఇదే మొదటిసారి. ఇందులో ప్రధాన పాత్రల్లో సుమేధ్ ముద్గల్కర్, సాయాలీ సంజీవ్ నటించారు. వీళ్ళ మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇది 2025 సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (netflix)లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సిటీలో సెటిలైపోయిన ఆనంద్ కుర్రాడు, తన తండ్రి చనిపోయాడన్న వార్త విని అడవి ప్రాంతంలో ఉన్న తన సొంత ఊరికి వస్తాడు. తండ్రికి తలకొరివి పెట్టడానికి వచ్చిన అతను మరో పది రోజులు సంతాప దినాల కోసం ఊరిలోనే ఉండాల్సి వస్తుంది. ఆ ఊరు మునుపటిలా కాకుండా ఏదో కొత్తగా ఉన్నట్టు కనిపిస్తుంది. 30 ఏళ్ల వయసున్న ఆనంద్ కి ఈ సమయంలో తన చిన నాటి స్నేహితుడు కనిపిస్తాడు. అతను కనిపించగానే ఆనంద్ కు ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. ఒక పక్క అంత్యక్రియలు జరుగుతుండగానే, అతనితో ప్రేమలో పడతాడు. అయితే బయట వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం కూడా ఉంటుంది. మాటల కంటే మౌనంతో, చూపులతోనే ఎక్కువ కథ నడుస్తుంది. అందుకే ఈ మరాఠీ సినిమా ప్రపంచస్థాయిలో మెప్పు పొందింది. చివరికి ఆనంద్ సిటీకి వెళ్లిపోవాల్సిన టైమ్ వస్తుంది. ఈ క్రమంలో వీళ్ళ ప్రేమ ఎలాంటి మలుపులకు దారి తీస్తుంది ? సమాజం, ఫ్యామిలీ ఈ ప్రేమను అంగీకరిస్తారా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also :  దేవుడి కోరికను తీర్చే మనిషి… ఓటీటీలోకి మలయాళ ఫాంటసీ డ్రామా… ఎక్కడ చూడచ్చు అంటే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×