E-Paper
Advertisement

Romantic drama OTT: భర్త బోరింగ్… బాస్ తో ఎఫైర్… కిరాక్ స్టోరీ సామి

Romantic drama OTT: భర్త బోరింగ్… బాస్ తో ఎఫైర్… కిరాక్ స్టోరీ సామి
Advertisement

Romantic drama OTT : రొమాంటిక్ సినిమాలకు ఆదరణ ఎక్కువే ఉంటుంది. వీటిలో లవ్ స్టోరీలను తెగ చూస్తుంటారు కూడా. ఇక కొరియన్, జపనీస్ లవ్ స్టోరీలను అస్సలు వదిలిపెట్టడం లేదు ఆడియన్స్. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే జపనీస్ సినిమా చాలా ఆసక్తిగా ఉంటుంది. కొత్తగా పెళ్ళయిన ఒక అమ్మాయికి భర్త అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. దీంతో ఆమె అతని బాస్ తో రిలేషన్ పెట్టుకుంటుంది. ఈ స్టోరీలో ఆతరువాత వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కూడా. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ జపనీస్ రొమాంటిక్ మూవీ పేరు “A Flower Aflame” (జపనీస్ టైటిల్: Kashin). ఈ చిత్రానికి హిరోషి ఆండో దర్శకత్వం వహించారు. ఇందులో మురకావా ఎరి, ఆండో మసనోబు, రినా అయిజావా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 1958లో ప్రసిద్ధ జపనీస్ రచయిత్రి సెటౌచి జకుచో రాసిన వివాదాస్పద నవల ఆధారంగా రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా mubi, Apple tv ఓటీటీలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సోనోకో అనే అమ్మాయికి తనకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా, పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో అమమియా అనే వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. వీళ్ళు టోక్యో నగరానికి కాపురం మారతారు. అమమియా చూడటానికి పద్ధతిగా ఉన్నా, సోనోకోకు అతని మీద ఎలాంటి ఫీలింగ్ కలగదు. వాళ్ళ మధ్య శృంగారం కూడా కేవలం పిల్లల కోసం అన్నట్టుగా సాగుతుంది తప్ప, ఇష్టంతో మాత్రం ఆ కార్యక్రమం జరగదు. తన జీవితం ఒక గూటిలో బంధించిన పిట్టలా మారిపోయిందని, తనలోని కోరికలు లోపలే అణచి పెట్టుకోవాల్సి వస్తోందని ఆమె ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది.

ఇలాంటి సమయంలోనే ఆమెకు తన భర్త బాస్ అయిన ఒచి పరిచయం అవుతాడు. ఒచి చాలా తెలివైనవాడు. అంతేకాసు ఆడవారి మనసును అర్థం చేసుకోగల వ్యక్తి కూడా. ఇంకేముంది అతనితో పరిచయం పెరిగాక సోనోకోలో అప్పటివరకు నిద్రపోతున్న కోరికలు, ఒక్కసారిగా మేల్కొంటాయి. భర్త దగ్గర ఎప్పుడూ దొరకంది, ఒచి దగ్గర దొరకడంతో ఆమె అతనితో వివాహేతర సంబంధానికి మొగ్గు చూపుతుంది. ఎవరు ఏమనుకున్నా, తన భర్తకు తెలిసినా సరే, తన శరీరానికి కావాల్సింది తీసుకుంటుంది. చివరికి ఈ విషయం ఆమె భర్తకు తెలుస్తుందా ? ఈ అంతులేని కథకు క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను మాత్రం, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : యజమానికి చుక్కలు చూపించే రోబో… అబ్బురపరిచే విజువల్స్… ఐయండిబిలో టాప్ రేటింగ్ కూడా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×