E-Paper
Advertisement

Romantic Drama OTT: చిన్ననాటి ప్రేమే కానీ చిన్న ట్విస్టు… చూస్తే అస్సలు వదిలిపెట్టరు

Romantic Drama OTT: చిన్ననాటి ప్రేమే కానీ చిన్న ట్విస్టు…  చూస్తే అస్సలు వదిలిపెట్టరు
Advertisement

Romantic Drama OTT : క్యూట్‌గా సాగే ఒక ప్రేమ కథను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను తప్పకుండా చూడాలి. తన కన్నా ఏడేళ్ళ పెద్ద అమ్మాయిని ప్రేమించే ఒక యువకుడి చుట్టూ కథ ఉంటుంది. ఇది కేవలం ప్రేమ కథే కాకుండా, సిటీలో ఒంటరిగా ఉంటూ కెరీర్ కోసం కష్టపడే ముప్పై ఏళ్ల మహిళల జీవితాలను కూడా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. అందుకే దీనికి మంచి రేటింగ్స్ వచ్చాయి. అలాగే సిరీస్ కూడా చూసినంత సేపు హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనికి ఐయండిబిలో 7.9 రేటింగ్ కూడా ఉంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ చైనీస్ రొమాంటిక్ డ్రామా పేరు ‘మై ఫేటెడ్ బాయ్’ (My Fated Boy). 2021లో వచ్చిన ఈ సిరీస్ లో మొత్తం 29 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఇందులో హీరోయిన్ పాత్రలో లి గ్జిరుయ్ నటించింది. ఆమెకు చైనాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక హీరోగా నటించిన హే యు తన క్యూట్ లుక్స్‌తో, హీరోయిన్ అంటే ప్రాణం ఇచ్చే అబ్బాయిగా కుర్రకారును బాగా ఆకట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సిరీస్‌కి మెయిన్ ప్లస్ పాయింట్.ఇది Viki, YOUKU యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇందులో హీరోయిన్ లిన్ యాంగ్ వయసు 31 ఏళ్లు. తను సిటీలో ఒక పెద్ద కంపెనీలో పని చేస్తూ బిజీగా ఉంటుంది. చిన్నప్పుడు తన పక్కింట్లో ఒక కుర్రాడు ఉండేవాడు. వాడి పేరు లు జెంగ్ ఆన్. వీళ్లిద్దరూ కలిసి ఆడుకునేవారు, ఒకరినొకరు బాగా ఇష్టపడేవారు. కానీ హీరోయిన్ వయసులో వాడి కంటే ఏడేళ్లు పెద్దది. వాడు చిన్నపిల్లాడిలా కనిపిస్తాడని హీరోయిన్ వాడిని ఎప్పుడూ ఒక తమ్ముడిలాగే చూసేది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళ ఫ్యామిలీలు విడిపోతాయి. అయితే ఇప్పుడు ఆ కుర్రాడు విదేశాల నుండి ఒక హ్యాండ్సమ్ హీరోలా తిరిగి వస్తాడు. ఇక్కడి నుంచే అసలు కథ ఉంటుంది.

వాడు రాగానే హీరోయిన్ ఇంట్లోకి నేరుగా వెళ్తాడు. తను ఇప్పుడు చిన్నపిల్లాడు కాదని, తనని పెళ్లి చేసుకోవడానికే వచ్చానని హీరోయిన్‌కి ముచ్చెమటలు పట్టిస్తాడు. హీరోయిన్ మాత్రం నువ్వు నాకంటే చిన్నోడివి, నీతో ప్రేమేంటని మొండికేస్తుంది. కానీ వాడు మాత్రం వదలకుండా తనకి వంట చేసి పెట్టడం, జాగ్రత్తగా చూసుకోవడం చేస్తూ హీరోయిన్ మనసుని మార్చడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అతని ప్రయత్నం ఫలిస్తుందా ? వీళ్ళ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారా ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుడుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఓటీటీలో దుమ్ము లేపుతున్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్… మాఫియాపై అలుపెరుగని పోరాటం… ట్రెండింగ్‌లోనూ తోపే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×