E-Paper
Advertisement

సిటీ పిల్ల పల్లెటూరికి… మనసుకు ప్రశాంతతను ఇచ్చే కొరియన్ లవ్ స్టోరీ

సిటీ పిల్ల పల్లెటూరికి… మనసుకు ప్రశాంతతను ఇచ్చే కొరియన్ లవ్ స్టోరీ
Advertisement

Romantic Drama series OTT : ప్రశాంతతను ఇచ్చే ఒక అందమైన ప్రేమ కథను చూడాలని ఎవ్వరికైనా ఉంటుంది. అలాంటి కథలు చూస్తుంటే మన లోపల ఉన్న భారం కూడా దిగిపోతుంటుంది. అలాంటి ఫీలింగ్ కొన్ని కొరియన్ డ్రామాలు చూస్తే వస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే కే డ్రామా ప్రేక్షకులకు ఎంతో ప్రశాంతతను ఇచ్చే హీలింగ్ డ్రామాగా గుర్తింపు పొందింది. ఎందుకంటే ఈ సిరీస్ కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, పల్లెటూరిలోని మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలను, చాలా సున్నితంగా తెరకెక్కించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇది మంచి గుర్తింపు పొందింది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ అందమైన కొరియన్ రొమాంటిక్ డ్రామా పేరు ‘హోమ్‌టౌన్ చా-చా-చా’ (Hometown Cha-Cha-Cha). 2021లో వచ్చిన ఈ సిరీస్ లో షిన్ మిన్-ఆ (యూన్ హ్యే-జిన్), కిమ్ సోన్-హో (హాంగ్ డు-సిక్) ప్రధాన పాత్రల్లో నటించారు. సిరీస్‌ను దక్షిణ కొరియాలోని అందమైన తీర ప్రాంత నగరం పోహాంగ్ లో చిత్రీకరించారు. డ్రామాలో చూపించిన ఆ పడవ, ఎర్రటి లైట్‌హౌస్, కొండ ప్రాంతాలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే, షూటింగ్ ముగిసిన తర్వాత కూడా పర్యాటకులు అక్కడికి భారీగా వెళ్లడం మొదలుపెట్టారు. అలాగే ఈ కథ 2004లో వచ్చిన ‘మిస్టర్ హ్యాందీ, మిస్టర్ హాంగ్’ అనే కొరియన్ సినిమా ఆధారంగా రూపొందింది. ఇక ప్రధాన నటీనటులైన షిన్ మిన్-ఆ, కిమ్ సోన్-హో ఇద్దరికీ బుగ్గన సొట్టలు ఉండటంతో, అభిమానులు వీరిద్దరినీ కలిపి ‘డింపుల్ కపుల్’ అని ముద్దుగా పిలుచుకుంటారు.రేటింగ్స్ పరంగా కూడా ఇది కొరియన్ టెలివిజన్ చరిత్రలో అత్యధిక వ్యూయర్ షిప్ సాధించిన టాప్-10 డ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సిటీలో డెంటిస్ట్‌గా పనిచేసే యూన్ హ్యే-జిన్ ఒక పక్కా ప్రొఫెషనల్. తన పద్ధతులకు వ్యతిరేకంగా వెళ్లిన హాస్పిటల్ యాజమాన్యంతో గొడవపడి ఉద్యోగం మానేస్తుంది. ఆ తర్వాత సరదాగా గొంగ్జిన్ అనే సముద్ర తీర గ్రామానికి వెళ్లిన ఆమెకు అక్కడ చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. చివరికి అదే ఊరిలో తన సొంత క్లినిక్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. అక్కడ చీఫ్ హాంగ్ అనే వ్యక్తిని అందరూ గౌరవిస్తారు. ఈ సమయంలో ఆమెకు అతను పరిచయమవుతాడు. అతను ఏ ఉద్యోగం చేయకపోయినా ఊర్లో ఏ అవసరం వచ్చినా ముందుండి ఆదుకుంటూ ఉంటాడు.

మొదట్లో హ్యే-జిన్ తన సిటీ అలవాట్లతో పల్లెటూరి మనుషులను అర్థం చేసుకోలేక కాస్త ఇబ్బంది పడుతుంది. కానీ చీఫ్ హాంగ్ ఆమెకు ఊరి వాళ్లతో ఎలా కలవాలో, మనుషుల విలువ ఏంటో నేర్పిస్తాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు, సరదా కబుర్లు జరిగి మెల్లగా అవి ప్రేమగా మారుతాయి. ఇక ఆ పల్లెటూరి మనుషుల మధ్య ఉండే ప్రేమాభిమానాలు, బంధాలు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ డ్రామా చూస్తుంటే చాలా ప్రశాంతంగా, ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. అందుకే దీనిని అందరూ ఒక గొప్ప ‘హీలింగ్’ డ్రామా అని కూడా అంటారు.

Advertisement

Read Also : రాత్రైతే ఊరిని వల్లకాడు చేసే వింత పిశాచాలు… ఒంటరిగా చూడకూడని హర్రర్ సిరీస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×