E-Paper
Advertisement

భర్త మిస్సింగ్ లో వీడని సస్పెన్స్… మరొక మగాడి రాకతో మారిపోయే కథ

భర్త మిస్సింగ్ లో వీడని సస్పెన్స్… మరొక మగాడి రాకతో మారిపోయే కథ
Advertisement

Romantic Drama OTT : ఎమోషన్స్ ని కొంతమంది దర్శకులు మాత్రమే చాలా చక్కగా చూపించగలరు. వీటితో ఆడియన్స్ ను ఇట్టే కట్టిపడేస్తారు కూడా. అలాంటి ఒక చూడ చక్కని కంటెంట్ తో ఒక మూవీ వచ్చింది. ఈ సినిమాలో ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయి. ఒక ఆడది తన బాధను దిగమింగుకుని ఎలా బతుకుతుంది, చివరకు ఆమెకు ప్రశాంతత దొరికిందా లేదా అనేది దర్శకుడు చాలా క్లాస్‌గా చూపించాడు. పెళ్లయిన కొద్దిరోజులకే భర్త కనిపించకుండా పోవడంతో, ఒంటరిగా మిగిలిన ఆ మహిళ జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశిస్తాడు. ఆ తరువాత కథ మరింత ఆసక్తిగా మారుతుంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ బెంగాలీ ఫ్యామిలీ రోమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘గృహప్రవేశ్’ (Grihapravesh). ఇది 2025 జూన్ 13న థియేటర్లలో విడుదలై విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. ఇంద్రాదీప్ దాస్‌గుప్త దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సుభాశ్రీ గంగూలీ (తిత్లీగా), కౌశిక్ గంగూలీ (మేఘ్‌గా) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాకు ఇంద్రాదీప్ దాస్‌గుప్త దర్శకత్వం వహించడమే కాకుండా, ఆయనే స్వయంగా సంగీతాన్ని కూడా అందించారు. ముఖ్యంగా అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ పాడిన పాటలు సినిమాకు పెద్ద ఎసెట్ అని చెప్పాలి. విమర్శకులు ఈ సినిమాను దివంగత దర్శకుడు రితుపర్ణో ఘోష్ తీసే క్లాసిక్ సినిమాలతో పోల్చారు, అంతలా ఈ మూవీ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంది. 2025లో విడుదలైన బెంగాలీ సినిమాల్లో ఇది మంచి వసూళ్లను సాధించింది. నటి సుభాశ్రీ గంగూలీకి ఈ సినిమా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని పేరు వచ్చింది. ఆమెకు ‘ఉత్తమ నటి’గా కొన్ని అవార్డులు కూడా దక్కాయి. ప్రస్తుతం ఈ సినిమా Hoichoi, Amazon Prime Video ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా కోల్‌కతాలోని ఒక పాత కాలపు పెద్ద బంగ్లాలో జరుగుతుంది. ఇందులో హీరోయిన్ తిత్లీకి (సుభాశ్రీ గంగూలీ) పెళ్లవుతుంది కానీ, పెళ్లయిన కొద్ది రోజులకే ఆమె భర్త షావోన్ ఎక్కడికో వెళ్ళిపోయి అడ్రస్ లేకుండా పోతాడు. పాపం ఆ పిల్లకు ఏం చేయాలో అర్థం కాక, తన అత్తమామలనే తన లోకంగా భావించి ఆ పెద్ద ఇంట్లోనే ఉండిపోయి వాళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది.

ఏళ్లు గడుస్తున్నా భర్త జాడ లేదు, కానీ తిత్లీ మాత్రం లోపల ఏదో మూల ఆశతో బతుకుతుంటుంది. ఇలాంటి టైంలో దసరా పండుగ (దుర్గా పూజ) వస్తుంది. ఆ హడావిడిలో మేఘ్ (కౌశిక్ గంగూలీ) అనే ఒక కొత్త వ్యక్తి ఆ ఇంటికి వస్తాడు. అతను వచ్చాక ఆ ఇంట్లో వాతావరణం మారిపోతుంది. చివరికి ఆ కొత్త వ్యక్తి రాకతో తిత్లీ జీవితంలో ఉన్న చీకటి పోయిందా? తన భర్త ఏమయ్యాడో తెలిసిందా? అసలు అతను ఎవరు? ఎందుకు వచ్చాడు? అనే విషయాలతో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతూ ఊహించని క్లైమాక్స్ తో ముగుస్తుంది.

Advertisement

Read Also : ఇది దెయ్యం కథ కాదు.. కానీ అంతకంటే భయంకరమైన సైకలాజికల్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×