E-Paper
Advertisement

Romantic Drama OTT : కొత్త కాపురంలో చిచ్చు పెట్టే పాత ప్రేమికుడు… పిచ్చెక్కించే రొమాంటిక్ డ్రామా

Romantic Drama OTT : కొత్త కాపురంలో చిచ్చు పెట్టే పాత ప్రేమికుడు… పిచ్చెక్కించే రొమాంటిక్ డ్రామా
Advertisement

Romantic Drama OTT : ట్రయాంగిల్ ప్రేమ కథలు చాలా ఇంట్రెస్టింగా ఉంటాయి. అయితే అంతే టెన్షన్ కూడా పెడుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో పెళ్లి అయిన మహిళ లైఫ్ లోకి పాత ప్రేమికుడు వస్తాడు. ఆ తరువాత కథ రసవత్తరంగా ఉంటుంది. ఈ సినిమా బెంగాలీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇందులో వెండితెర లెజెండ్స్ కూడా నటించారు. ఈ సినిమాలో జంటగా నటించిన, హీరో హీరోయిన్లకు ఇది 50వ సినిమా కావడం విశేషం.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ బెంగాలీ రొమాంటిక్ డ్రామా పేరు ‘అజోగ్యో’ (Ajogyo). నేషనల్ అవార్డ్ విన్నర్ కౌశిక్ గంగూలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన సినిమాల్లో ఎప్పుడూ ఉండే క్లాసిక్ టచ్ ఇందులోనూ కనిపిస్తుంది. ఇందులో ప్రోసేన్‌జిత్ ఛటర్జీ, ఋతుపర్ణ సేన్‌గుప్త, శిలాజిత్ మజుందార్, లిల్లీ చక్రవర్తి లీడ్ రోల్స్ లోనటించారు. బెంగాలీ సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ జోడీ అయిన ప్రోసేన్‌జిత్ ఛటర్జీ, ఋతుపర్ణ సేన్‌గుప్త కలిసి నటించిన 50వ సినిమా ఇది. వీరిద్దరూ దాదాపు 30 ఏళ్లుగా వెండితెరపై మ్యాజిక్ చేస్తున్నారు. ఇక అనుపమ్ రాయ్ అందించిన పాటలు బెంగాల్‌లో పెద్ద హిట్ అయ్యాయి కూడా. 2024లో వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ సక్సెస్‌గా ఈ సినిమా నిలిచింది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఇంకా అడుగు పెట్టలేదు. తొందరలోనే hoichoi ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో భర్త రక్తీమ్ (శిలాజిత్)కి ఉన్నట్టుండి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఊడిపోతుంది. ఇంట్లో పైసలు లేక తిప్పలు పడుతుంటే, భార్య పర్ణ (ఋతుపర్ణ) తానే ఏదోకటి చేయాలని బ్యాంక్ ఉద్యోగంలో చేరుతుంది. భర్త ఖాళీగా ఉండి తాగుడుకి అలవాటు పడితే, పెళ్లాం కష్టపడి ఇల్లు గడుపుతుంటుంది. ఇలాంటి టైమ్‌లో పాత కాలం నాటి దోస్తు, పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన ప్రోసేన్ మిత్ర (ప్రోసేన్‌జిత్) వీళ్ల లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తాడు.

ప్రోసేన్ మిత్ర రాకతో ఆ ఫ్యామిలీ కష్టాలన్నీ తీరిపోయినట్టు అనిపిస్తాయి కానీ, అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. పర్ణకి, ప్రోసేన్‌కి మధ్య గతంలో ఏదో బలమైన ప్రేమ కథ ఉందనే విషయం మెల్లగా బయటపడుతుంది. పాత ప్రేమికుడు మళ్ళీ కళ్ళ ముందు కనిపిస్తుంటే, అటు మొగుడి పరిస్థితి చూసి పర్ణ నలిగిపోతుంటుంది. అసలు వీడు సాయం చేయడానికి వచ్చాడా లేక పాత పగ తీర్చుకోవడానికి వచ్చాడా అనే సస్పెన్స్ తో కథ రసవత్తరంగా సాగుతుంది. చివరికి పర్ణ ఎవరి వైపు నిలబడింది? ఆ పాత ప్రేమ వల్ల ఇప్పుడున్న కాపురం కూలిపోయిందా ? ఈ కథకు ముగింపు ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : అట్లాంటిక్ అలల సాక్షిగా విడిపోయే ప్రేమ జంట… 35 ఏళ్లకు కలిసినా చెరిగిపోని జ్ఞాపకాలు… ఇదొక అంతులేని ఆవేదన

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×