E-Paper
Advertisement

పాత జ్ఞాపకాలు… కొత్త రాగాలు… దీవిలో మొదలైన వింత ప్రేమ కథ

పాత జ్ఞాపకాలు… కొత్త రాగాలు… దీవిలో మొదలైన వింత ప్రేమ కథ
Advertisement

Romantic Comedy OTT : ఒక మాంచి నవ్వులాట, అలాగే కొంచెం మనసుకి హత్తుకునే సినిమా గురించి చూస్తున్నారా ? అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. థియేటర్లలో హిట్ అయిన ఈ హాలీవుడ్ సినిమా చాలా సరదాగా ఉంటుంది. ఇందులో ఒక లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక దీవిలో ఈ కథ మొదలవుతుంది. ఒక లాటరీ గెలిచిన వ్యక్తి, విడిపోయిన ప్రేమికులను కలిపి వాళ్ళ ద్వారా మ్యూజిక్ షో ఏర్పాటు చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

2025లో వచ్చిన ఈ బ్రిటిష్ కామెడీ మూవీ పేరు ‘ది బ్యాలడ్ ఆఫ్ వాలిస్ ఐలాండ్’ (The Ballad of Wallis Island). ఇందులో టిమ్ కీ, కారీ ముల్లిగాన్, టామ్ బాస్డెన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం కేవలం థియేటర్లలోనే కాకుండా సన్ డాన్స్, SXSW వంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా JioHotstar, Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథలో ఒక వ్యక్తికి లాటరీలో భారీగా డబ్బు వస్తుంది. దాంతో అతను ఒక నిర్మానుష్యమైన ద్వీపానికి వెళ్లిపోయి, అక్కడ ఒంటరిగా విలాసవంతమైన జీవితం గడుపుతుంటాడు. అయితే అతనికి ఒక పాత మ్యూజిక్ బ్యాండ్ అంటే విపరీతమైన పిచ్చి. ఆ బ్యాండ్‌లో ఒకప్పుడు ప్రేమికులుగా ఉండి, తర్వాత గొడవపడి విడిపోయిన ఇద్దరు సింగర్లను మళ్ళీ కలపాలని వాడు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఒక పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుందని అబద్ధం చెప్పి, ఆ ఇద్దరినీ తన ద్వీపానికి రప్పిస్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక, అక్కడ వేలమంది జనం ఎవరూ లేరని, కేవలం ఈ ఒక్కడి కోసమే తాము ప్రదర్శన ఇవ్వాలని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ చిన్న ద్వీపంలో, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ విడిపోయిన పాత ప్రేమికులిద్దరూ ఇప్పుడు ఒకరినొకరు భరించాల్సి వస్తుంది. ఆ ద్వీపంలో వాళ్ళ మధ్య జరిగే పాత గొడవలు, ఈ వింత మనిషి చేసే పనులు కథను నవ్వుతూ సాగిస్తాయి. చివరికి విడిపోయిన ఆ ఇద్దరు కళాకారులు మళ్ళీ కలిశారా లేదా అన్నదే ఈ సినిమాలో అసలు ట్విస్ట్.

Read Also : ఆర్మీ అడ్డాలో అదిరిపోయే వేట… నిజాన్ని నిగ్గు తేల్చే మేజర్… క్రేజీగా ప్రతి ఎపిసోడ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×