E-Paper
Advertisement

Romantic comedy OTT: పెళ్లికి ముందు అలాంటి పని… కళ్ళు తెరిపించే క్లైమాక్స్… పొట్ట చెక్కలయ్యే కామెడీ కూడా

Romantic comedy OTT: పెళ్లికి ముందు అలాంటి పని… కళ్ళు తెరిపించే క్లైమాక్స్… పొట్ట చెక్కలయ్యే కామెడీ కూడా
Advertisement

Romantic comedy OTT : ఓటీటీలోకి ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి. వస్తుంటాయి కూడా. అయితే థ్రిల్లర్ జానర్ తరువాత అంత క్రేజీగా కామెడీ జానర్ ని చూస్తుంటారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో ఒక పంజాబీ కామెడీ సినిమా గురించి చప్పుకోవాల్సిందే. ఈ కథలో పెళ్లికి ముందే రాత్రి అతిగా మద్యం సేవించడం వల్ల హీరో కంటిచూపు కోల్పోతాడు. ఆ తరువాత అతను పడే కష్టాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా పేరు, ఎక్కడ చూడచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ పంజాబీ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘వధాయియాన్ జీ వధాయియాన్’ (Vadhayiyaan Ji Vadhayiyaan). 2018 జూలై 13న వచ్చిన ఈ సినిమాకు స్మీప్ కాంగ్ దర్శకత్వం వహించారు. బిన్నూ ధిల్లాన్, కవితా కౌశిక్, గురుప్రీత్ గుగ్గీ, కరమ్జిత్ అన్మోల్, జస్విందర్ భల్లా నటించిన ఈ సినిమాకి ఐయండిబిలో 6.9/10 రేటింగ్ కూడా ఉంది. ఈ సినిమాలో అంధుడిగా బిన్నూ ధిల్లాన్ చేసిన నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఆయన కేవలం హీరోగానే కాకుండా, ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక కవితా కౌశిక్ తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ, హిందీ సీరియల్ ‘F.I.R.’ లో చంద్రముఖి చౌతాలాగా చాలా ఫేమస్. ప్రముఖ పంజాబీ సంగీత దర్శకుడు జతీందర్ షా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా దాదాపు ₹6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, బాక్సాఫీస్ వద్ద ₹20.15 కోట్లకు పైగా వసూలు చేసి ‘సూపర్ హిట్’గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాను Amazon Prime Video ప్లాట్‌ ఫామ్‌లో చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పర్గత్ (బిన్నూ ధిల్లాన్) అనే కుర్రాడు గగన్ (కవితా కౌశిక్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎలాగోలా కష్టపడి గగన్ తండ్రిని ఒప్పించి పెళ్లికి ముహూర్తం పెట్టించుకుంటాడు. ఇంకేముంది, పెళ్లి ఫిక్స్ అయిందన్న ఆనందంలో తన స్నేహితులతో కలిసి ఒక రాత్రి ఫుల్లుగా పార్టీ చేసుకుంటాడు. కానీ మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి, ఆ మత్తులో పర్గత్‌కు కంటిచూపు పోతుంది. పెళ్లి ఆగిపోతుందేమో అన్న భయంతో పర్గత్ తనకి చూపు లేదన్న విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెడతాడు. పెళ్లి చూపుల దగ్గర నుండి పెళ్లి పీటల వరకు అంధుడిగా ఉంటూనే, ఏమీ తెలియనట్లు తన ఫ్రెండ్స్ సాయంతో అందరినీ ఎలా మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో వచ్చే నవ్వులు పుట్టించే గందరగోళ పరిస్థితులే ఈ సినిమా. చివరకు గగన్ ఫ్యామిలీకి ఈ విషయం తెలిసిందా ? ఈ పెళ్లి జరిగిందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : ఇద్దరబ్బాయిలతో అమ్మాయి వ్యవహారం… మతిపోగొట్టే రోడ్ ట్రిప్… ఇది పెద్దలకు మాత్రమే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×