// // Patang OTT Release date : తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా -->
E-Paper
Advertisement

Patang OTT Release date : తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా ‘పతంగ్’ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Patang OTT Release date : తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా ‘పతంగ్’ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Advertisement

Patang OTT Release date : రొమాంటిక్ కామెడీ డ్రామా జోనర్‌లో రిసెంట్‌గా థియేటర్లలో రిలీజ్ అయిన మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వస్తోంది. డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఓటీటీలో ఇది ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేస్తుందని మేకర్స్ ఎదురుచూస్తున్నారు. థియేటర్ రిలీజ్ తర్వాత కేవలం ఒక నెల లోపే ఇది స్ట్రీమింగ్ కి వస్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అంటే

ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పేరు ‘పతంగ్’. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2026 జనవరి 30 నుంచి Sun NXTలో అధికారికంగా అందుబాటులో ఉంటుంది. ఈ రొమాంటిక్ కామెడీ జనవరి 30న ఉదయం 12 గంటల నుండి సన్ NXT, OTTplay ప్రీమియంలో ప్రసారం అవుతుంది. ఇక సహాయక పాత్రల్లో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, SP చరణ్ కూడా ఉన్నారు. పతంగ్ ప్రేక్షకులని పెద్దగా ఆలత్తుకోలేదు. అయితే సన్ NXT లో ఇటీవల విడుదలైన మరో తెలుగు చిత్రం ‘జిగ్రిస్’ మాత్రం ఆడియన్స్ చేత నవ్వులు పూయించింది. మరి అదే బాటలో ఈ సినిమా కూడా ఓటీటీలో ఆకట్టుకుంటుందా అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అరుణ్ ఒక సంపన్న కుటుంబం నుండి వచ్చాడు. కానీ విస్కీ ఒక బస్తీ కుటుంబం నుండి  వస్తాడు. ఇద్దరూ చాలా భిన్నమైన నేపథ్యాల నుండి వచ్చినప్పటికీ జీవితాంతం స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరికీ 12 ఏళ్ల సుదీర్ఘమైన స్నేహం ఉంటుంది. అయితే కథలో ఐశ్వర్య అనే అమ్మాయి విస్కీ తో ప్రేమలో పడుతుంది. విస్కీ అదే ప్రాంతంలో ఉండే అరుణ్‌ కి ఐశ్వర్య ని పరిచయం చేస్తాడు. ఇక ఈ ముగ్గురూ కలుసుకున్నప్పుడు కథ మారిపోతుంది. ఆ తర్వాత అరుణ్‌ని ఇష్టపడుతుంది ఐశ్వర్య. ఇదిట్రయాంగిల్ లవ్ కి దారి తీస్తుంది. దీంతో ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్ మధ్య విబేధాలు వస్తాయి.

గాలిపటాలు ఎగురవేయడం అనే హాబిట్ వల్ల, ఇక వీళ్ళు తమ ప్రేమను దక్కించుకోవడానికి పతంగ్‌ల పోటీకి వెళ్లాల్సి వస్తుంది. ఒకవైపు ప్రేమ, మరోవైపు స్నేహం మధ్య తలెత్తిన మనస్పర్థల వల్ల ఈ బంధం ప్రమాదంలో పడుతుంది. పాత బస్తీలోని గల్లీల నుంచి మొదలైన ఈ ప్రయాణం, చివరకు ఒక పెద్ద గాలిపటాల టోర్నమెంట్‌కు చేరుకుంటుంది. మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ప్రేమ ఎవరికి దక్కింది? అనేదే మిగతా స్టోరీ.

Advertisement

Read Also : గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫోన్… అంతలోనే అన్నోన్ డెలివరీ… కట్ చేస్తే ఫింగర్ కట్టయ్యే షాకింగ్ ట్విస్ట్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×