// // Romantic Comedy OTT : టైమ్ ట్రావెల్ చేసి అమ్మాయిల ప్రపంచం -->
E-Paper
Advertisement

Romantic Comedy OTT : టైమ్ ట్రావెల్ చేసి అమ్మాయిల ప్రపంచంలో ఇరుక్కునే అబ్బాయిలు… సింగిల్స్ పండగ చేసుకునే సినిమా

Romantic Comedy OTT : టైమ్ ట్రావెల్ చేసి అమ్మాయిల ప్రపంచంలో ఇరుక్కునే అబ్బాయిలు… సింగిల్స్ పండగ చేసుకునే సినిమా
Advertisement

Romantic Comedy OTT : ఒక ఫన్నీ రొమాంటిక్ కామెడీ సినిమా చూడాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ట్రై చెయ్యచ్చు. కానీ ఇది పెద్దలకు మాత్రమే. ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఒక మాయా వీడియో బూత్ ద్వారా ఆల్టర్నేట్ రియాలిటీలోకి వెళ్లిపోతారు. ఆ కొత్త ప్రపంచంలో ప్రతిదీ రొమాంటిక్ గా ఉంటుంది. ఇక ఈ సినిమాలో రొమాంటిక్ కామెడీకి కొదవే ఉండదు. సినిమా మొత్తం నవ్వులు పూయిస్తుంది. ఇది క్రిస్ ప్రాట్ కెరీర్ బెస్ట్ కామెడీ మూవీలలో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

స్టోరీలోకి వెళ్తే

‘Deep in the Valley’ 2009లో విడుదలైన ఒక అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా. దీనికి క్రిస్టియన్ ఫోర్టే దర్శకత్వం వహించారు. ఇందులో క్రిస్ ప్రాట్, బ్రెండన్ హైన్స్ ప్రధాన పాత్రలు పోషించారు. కిమ్ కర్దాషియాన్, డెనిస్ రిచర్డ్స్, స్కాట్ కాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా పూర్తిగా అడల్ట్ కామెడీతో తెరకెక్కింది. Amazon Prime Video, Apple TVలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also :  తెల్లారితే పెళ్లి… నైట్ కి నైట్ వధూవరులు జంప్… కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ

స్టోరీ ఏమిటంటే

కార్ల్ (బ్రెండన్ హైన్స్), లెస్టర్ (క్రిస్ ప్రాట్) అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు. కార్ల్ ఒక మామూలు ఉద్యోగం చేస్తూ తన గర్ల్‌ఫ్రెండ్‌తో సెటిల్ అవ్వాలని అనుకునే వ్యక్తి. అయితే లెస్టర్ మాత్రం ఎప్పుడూ అ*డల్ట్ సినిమాల లోకంలో విహరించే రకం. ఒకరోజు వాళ్ళు ఒక పాత వీడియో స్టోర్‌ లోకి వెళ్తారు. ఒక బటన్‌ను నొక్కగానే, ఒక వింత ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఆ వింత ప్రపంచంలో ప్రతి అమ్మాయి ఒక మోడల్‌లా కనిపిస్తుంది. పిజ్జా డెలివరీ, క్లీనింగ్ వంటివి చేసేవారు కూడా చాలా హాట్ గా కనిపిస్తారు. ఆపనికి సై అన్నట్టు అక్కడ అంతా సిద్ధమవుతుంటారు.

Advertisement

లెస్టర్ ఆ లోకాన్ని చూసి మురిసిపోతాడు. అది తన డ్రీమ్ వరల్డ్ అని అక్కడే ఉండిపోవాలనుకుంటాడు. కానీ కార్ల్ తన నిజ జీవితానికి తిరిగి వెళ్లాలని ప్రయత్నిస్తాడు. దారి మధ్యలో కార్ల్ తన అసలు గర్ల్‌ఫ్రెండ్ తనను మోసం చేస్తుందని తెలుసుకుంటాడు. ఆ వింత లోకంలోనే అతనికి ఒక నటితో నిజమైన ప్రేమ కలుగుతుంది. చివరకు వాళ్ళు తమ ప్రపంచానికి తిరిగి వెళ్ళారా ?ఆ వింత లోకంలోనే ఉండిపోయారా అనేది మిగిలిన కథ.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×