E-Paper
Advertisement

నైట్ షిఫ్ట్ జాబ్ లో అందాల విందు… సింగిల్స్ కి పండగే మావా

నైట్ షిఫ్ట్ జాబ్ లో అందాల విందు… సింగిల్స్ కి పండగే మావా
Advertisement

Romantic Comedy Movie on OTT : ఓటీటీలో చూసేందుకు ఒక వెరైటీ ప్రేమకథ అందుబాటులో ఉంది. అయితే ఇందులో బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి పెద్దలు చూస్తేనే మంచిది. ఒక లవ్ ఫెయిల్యూర్ లో ఉన్న ఒక కుర్రాడు, ఒక సూపర్ మార్కెట్‌లో నైట్ షిఫ్ట్ లో జాబ్ కి వెళ్తాడు. అయితే అక్కడ అతనికి కాలాన్ని ఆపే పవర్ వస్తుంది. ఈ పవర్ తో తన బోర్ కొట్టే లైఫ్‌ని కలర్‌ఫుల్‌గా ఎలా మార్చుకున్నాడనేది ఈ సినిమా. ఈ సినిమాను లండన్‌లోని ఒక నిజమైన సూపర్ మార్కెట్‌లో, అది మూసేసిన తర్వాత రాత్రి వేళల్లో షూటింగ్ చేసేవాళ్ళు. ఇక ఇందులో హీరో బట్టలు లేకుండా, ఆడవాళ్ల బొమ్మలు గీసే కొన్ని సీన్ల వల్ల ఈ సినిమాపై కొంత విమర్శ వచ్చింది. కానీ అది ఒక ఆర్టిస్ట్ కోణం చూపిస్తుందని సమర్థించుకున్నారు ఈ సినిమా డైరెక్టర్.

ఆపిల్ టివి (Apple TV)లో స్ట్రీమింగ్ 

ఈ బ్రిటిష్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా పేరు ‘క్యాష్‌బ్యాక్’ (Cashback). 2006లో వచ్చిన ఈ సినిమాకి షాన్ ఎల్లిస్ దర్శకత్వం వహించారు. ఇందులో షాన్ బిగ్గర్‌స్టాఫ్ (బెన్), ఎమిలియా ఫాక్స్ (షారన్) లీడ్ రోల్స్ లో నటించారు. డైరెక్టర్ షాన్ ఎల్లిస్ మొదట దీన్ని 2004లో ఒక షార్ట్ ఫిలింలా తీశారు, దానికి ఆస్కార్ నామినేషన్ రావడంతో 2006లో పూర్తి స్థాయి సినిమాగా మార్చారు. ఇందులో హీరోగా నటించిన షాన్ బిగ్గర్‌స్టాఫ్ మనకు ‘హ్యారీ పోటర్’ సినిమాల్లోని ‘ఆలివర్ వుడ్’ పాత్రతో బాగా పరిచయం. తక్కువ బడ్జెట్‌తో తీసినా, ఇందులోని మ్యూజిక్, విజువల్స్ వల్ల ఇది ఒక కల్ట్ క్లాసిక్ సినిమాగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ సినిమా ఆపిల్ టివి (Apple TV)లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

హీరో బెన్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యాక పిచ్చోడిలా అయిపోతాడు. ఆ బాధలో అతనికి అస్సలు నిద్ర పట్టదు. కళ్ళు మూస్తే ఆమె గుర్తొస్తుంది, కళ్ళు తెరిస్తే టైం అస్సలు గడవదు. దీంతో అతను రోజుకు 24 గంటలు మేల్కొనే ఉంటుంటాడు. ఈ ఖాళీ టైంని ఏం చేయాలో తెలీక, ఓ సూపర్ మార్కెట్‌లో నైట్ షిఫ్ట్ పనికి కుదురుతాడు. అక్కడ అతని లాంటి వెరైటీ మనుషులు మరికొందరు పరిచయమవుతారు.

నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు అతనికి టైమ్ ఫ్రీజ్ చేసే పవర్ వస్తుంది. తన పవర్ తో అతను ప్రపంచాన్ని మొత్తం ఫ్రీజ్ చేస్తాడు. అందరూ బొమ్మల్లా ఆగిపోతే, వాడు మాత్రం వాళ్ల మధ్యలో తిరుగుతూ తనకి ఇష్టమైన పెయింటింగ్స్ గీసుకుంటూ ఉంటాడు. వాడు వేసే పెయింటింగ్స్ మామూలుగా ఉండవు. బట్టలు తొలగించి ఆర్ట్ వేస్తుంటాడు. అలా తన కళ్ళ ముందు ఉన్న అందాన్ని ఆస్వాదిస్తూ ఆ బోర్ టైంని గడిపేస్తుంటాడు.

Advertisement

ఇలాంటి టైంలోనే షారన్ అనే అమ్మాయి బెన్ కి పరిచయమవుతుంది. ఆమెను చూడగానే పాత లవ్ బాధ మొత్తం పోతుంది. ఆమెతో ప్రేమలో కూడా పడతాడు. అయితే అనుకోకుండా వాళ్ళ మధ్య చిన్న గొడవ జరిగి అంతా చెడిపోయే పరిస్థితి వస్తుంది. చివరకి టైం ఫ్రీజ్ చేసే మ్యాజిక్‌తో షారన్‌ని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. మరి ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుందా ? అతనికి ఆ పవర్ ఎలా వచ్చింది ? ఈ సీక్రెట్ గురించి మరెవరికైనా తెలుస్తుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : పక్క పక్క గదుల్లో ఉంటూ మనసు ఇచ్చి పుచ్చుకునే జంట… కొత్త లోకంలోకి తీసుకెళ్లే మధురమైన ప్రేమ కథ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×