// // Revolver Rita OTT- ఓటీటీకి కీర్తి సురేష్‌ క్రైం యాక్షన్‌ మూవీ! -->
E-Paper
Advertisement

Revolver Rita OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న కీర్తి సురేష్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Revolver Rita OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న కీర్తి సురేష్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..
Advertisement

Revolver Rita Locks OTT: కీర్తి సురేష్‌ నటించిన క్రైం కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రివాల్వర్ రీటా’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. పెళ్లి తర్వాత ఆమె నుంచి వచ్చిన తొలి చిత్రమిది. దీంతో ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నవంబర్‌ 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ఆశించిన స్థాయిలో మూవీ ఆకట్టుకోలేకపోయింది. కెరీర్‌ మొదటి నుంచి కీర్తికి హిట్స్‌ కంటే ప్లాప్సే ఎక్కువ. పెళ్లి తర్వాత అయినా ఆమె ఫేట్‌ మారి రివాల్వర్‌ రీటాతో సక్సెస్ బాట పడుతుందంటుకుంటే మూవీ దారుణంగా నిరాశ పరిచింది. దీంతో విడుదలైన రెండు మూడు వారాలకే ఈ చిత్రం థియేటర్ల నుంచి వచ్చేసింది.

ఆ రోజు నుంచే స్ట్రీమింగ్

Advertisement

ఇక థియేట్రికల్‌ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. కాగా కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో రాధిక శరత్‌ కుమార్‌, సునీల్, అజయ్ గౌస్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కామెడీ యాక్షన్‌ క్రైం డ్రామాగా జేకే చందు తెరకెక్కించారు. రిలీజ్‌కి ముందే ఈ మూవీ ఓటీటీ డీల్‌ పూర్తి చేసుకుంది. దిగ్గజ డిజిటల్‌ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ మూవీ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకుంది. ఇక ఒప్పందం ప్రకారం ఈ సినిమాను మరికొద్ది రోజుల్లో డిజిటల్‌ ప్రీమియర్స్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 26న మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్‌కి ఇవ్వబోతుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. తమిళంలో తెరకెకకిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైంది. అయితే ఓటీటీలో మాత్రం పాన్‌ ఇండియా భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. తమిళ్‌, తెలుగులో పాటు మలయాళం, హిందీ, కన్నడలో భాషల్లోనూ రివాల్వర్‌ రీటా స్ట్రీమింగ్‌ కానుంది.

కథేంటంటే!

ఇక థియేటర్లలో మిస్‌ అయిన వారు ఇంట్లోనే ఈ సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి. పాండిచ్చేరికి చెందిన రీటా(కీర్తి సురేశ్‌) నాన్న చిన్నప్పుడే ల్యాండ్‌ విషయంలో ఓ గ్యాంగ్‌స్టర్‌ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతను తీసుకున్న రీటా ఓ బేకరీలో పని చేస్తూ తన తల్లి చెల్లమ్మ(రాధిక శరత్‌కుమార్‌), ఇద్దరు సొదరిమణులను పోషించుకుంటుంది. తన అక్క కూతురు తొలి పుట్టిన రోజును జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇంట్లోకి పాండిచ్చేరిలోనే పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ పాండ్యన్‌(సూపర్‌ సుబ్బరాయన్‌) వస్తాడు. తాగిన మత్తులో దారితప్పి వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్‌తో రీటా ఫ్యామిలీకి చిన్న గొడవ జరుగుతుంది.

Advertisement

మాట మాట పెరిగి.. రీటా తల్లి అతన్ని కిందకు తోసేయ్యగా.. తలకు గట్టిదెబ్బ తగిలి చనిపోతాడు. ఈ విషయం తెలిస్తే పాండ్య కొడుకు బాబీ(సునీల్‌)కచ్చితంగా తమని చంపేస్తాడనే భయంలో శవాన్ని ఇంట్లోనే దాచి బర్త్‌డేని సెలెబ్రేట్‌ చేసుకుంటారు.  మరుసటి రోజు ఓ కారులో ఆ శవాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలోనే తండ్రి ఇంట్లో లేడనే విషయం బాబీకి తెలిసి తనదైన శైలీలో వెతుకుతుంటాడు. మరోవైపు పాండ్య శవాన్ని రీటా ఇంటి నుంచి దొంగిలించి.. మరో డాన్‌ నర్సిరెడ్డి(అజయ్‌ గోష్‌) అప్పగించి రూ. 5 కోట్లు తీసుకోవాలి ఓ గ్యాంగ్‌ ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో రీటాపై పగ పెంచుకున్న సీఐ(జాన్ విజయ్)కి ఆమె ఓ కారుని దొంగతనంగా కొనుగోలు చేసిందనే విషయం తెలిసి అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌, పోలీసుల మధ్య నుంచి రీటా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుందునేది రివాల్వర్‌ రీటా కథ.

Also Read: The Raja Saab: అది మా అంతర్గతం.. ‘ది రాజాసాబ్‌’ రూమర్స్‌పై నిర్మాత అసహనం

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×