E-Paper
Advertisement

Revenge Thriller OTT : చెల్లిని కాపాడుకోవడానికి అక్క ఊచకోత… ఒక్కొక్కడిని పరిగెత్తించి… అల్టిమేట్ యాక్షన్ సీన్స్ తో కాటేరమ్మ జాతర

Revenge Thriller OTT : చెల్లిని కాపాడుకోవడానికి అక్క ఊచకోత… ఒక్కొక్కడిని పరిగెత్తించి… అల్టిమేట్ యాక్షన్ సీన్స్ తో కాటేరమ్మ జాతర
Advertisement

Revenge Thriller OTT : జానర్ ఏదైనా సరే ఓటీటీలోకి ఓ కొత్త సినిమా వచ్చిందంటే చాలు అందరి కళ్ళూ దాని మీదే ఉంటాయి. అందులోనూ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ‘యానిమల్’, ‘దురంధర్’ వంటి సినిమాలకు అంతటి ఆదరణ దక్కడానికి మెయిన్ రీజన్ దుమ్మురేపే యాక్షన్, బ్రూటల్ రివేంజ్ సీన్స్ ఉండడమే. అలాంటి జానర్లో వచ్చిన ఓ మంచి సినిమా కోసం ఓటీటీలో వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ మీ కోసమే. కాకపోతే ఇందులో అబ్బాయిలు కాదు ఆడపులి ఊచకోతను చూడవచ్చు. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం పదండి.

ఇండియాలో స్ట్రీమింగ్ కి లేదు

2019లో విడుదలైన సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్-డ్రామా ‘నో మెర్సీ’ (No Mercy). ఇమ్ గ్యోంగ్-టేక్ దర్శకత్వం వహించారు. నామ్ క్వాన్-వూ, జంగ్ సుక్-హ్యూన్ నిర్మించారు. ఈ సినిమాలో లీ సి-యంగ్ , పార్క్ సే-వాన్, లీ జూన్-హ్యూక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 2019 జనవరి 1న విడుదలైంది. ఈ ఎమోషనల్ ఇంటెన్స్ రివెంజ్ థ్రిల్లర్ ఇద్దరు అక్కాచెల్లెళ్ల చుట్టూ తిరుగుతుంది. కానీ నిరాశ కలిగించే విషయం ఏమిటంటే ఈ మూవీ ఇండియాలోని ఓటీటీలలో స్ట్రీమింగ్ కి అందుబాటులో లేదు. మరి గుడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం Dailymotionలో పూర్తి సినిమాను ఫ్రీగా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు. భాష అడ్డు కాదు అనుకుంటే 118 ఈ రివేంజ్ డ్రామాను అస్సలు మిస్ అవ్వొద్దు.

Advertisement

Also Read : ఈ రోజు ఓటీటీలోకి రెండు కొత్త సినిమాలు, ఒక సిరీస్… ఏది ఎక్కడ చూడొచ్చంటే ?

కథలోకి వెళ్తే…

ఒకప్పుడు కొరియన్ సైన్యంలో (combat instructor) పని చేసిన హీరోయిన్ ఇన్-ఏ, ఇప్పుడు మహిళా బాడీగార్డ్‌గా పని చేస్తుంది. ఆమెకు ఆటిజంతో బాధపడుతున్న సోదరి యున్-హే ఉంటుంది. ఆమెపై ఒకరోజు ఒక రాజకీయ నాయకుడు అఘాయిత్యం చేయడం చూస్తుంది. ఆమె కోపం కట్టలు తెంచుకోవడంతో అతనిపై దాడి చేసి, ఒక కన్నును కత్తితో పొడిచి వేస్తుంది. ఈ క్రైమ్ చేసినందుకు గానూ ఆమెకు శిక్ష పడుతుంది. అందులో భాగంగా ఏడాదిన్నర పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

Advertisement

ఎట్టకేలకు శిక్షను పూర్తి చేసుకుని ఇన్-ఏ జైలు నుండి బయటకు వస్తుంది. తన చెల్లిని చూసి సంతోష పడుతుంది. కానీ యున్-హైని పాఠశాలలో కూడా అలాగే వేధిస్తారు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. కానీ ఈ విషయాలేవీ తన సిస్టర్ తో చెప్పదు. ఈ క్రమంలోనే ముగ్గురు క్లాస్‌మేట్స్ యున్-హైని హోటల్ గదికి తీసుకెళ్లి అక్కడ ఓ మనిషిని కలవమని చెప్తారు. తలుపు తెరిచి ఉంచి, బాత్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ చేయమని బలవంతం చేస్తారు. ఈ గ్యాప్ లో ఆ ముగ్గురు గదిలోకి వెళ్ళి, సదరు వ్యక్తిపై దాడి చేసి దోచుకోవాలని ఇది ప్లాన్ చేస్తారు. అంతేకాదు ఆ అమ్మాయిని వాడుకుని అమ్మేయాలి అనుకుంటారు. ఆలోగా ఒక గ్యాంగ్‌స్టర్ ఆ అబ్బాయిలను భయపెట్టి, యున్-హేను కిడ్నాప్ చేస్తాడు. సిస్టర్ ఇంటికి రాకపోవడంతో హీరోయిన్ టెన్షన్ పడుతుంది. పోలీస్ కంప్లయింట్ ఇచ్చినా ఫలితం ఉండదు. ఇక్కడ నుంచి మొదలవుతుంది ఈ ఆడపులి ఊచకోత. మరి హీరోయిన్ తన సిస్టర్ ను ఎలా కనిపెట్టింది ? అసలు ఆటిజం ఉన్న పిల్లను ఎందుకు కిడ్నాప్ చేశారు ? అన్నది తెలియాలంటే ఈ మూవీపై ఒక లుక్కేయండి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×