E-Paper
Advertisement

Resort Tamil Series OTT : యూట్యూబర్ విజయ్ కుమార్ రాజేంద్రన్ కొత్త తమిళ సిరీస్‌ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ అప్పుడే

Resort Tamil Series OTT : యూట్యూబర్ విజయ్ కుమార్ రాజేంద్రన్ కొత్త తమిళ సిరీస్‌ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ అప్పుడే
Advertisement

Resort Tamil Series OTT : ఓటీటీలోకి కొత్త తమిళ సిరీస్ ‘రిసార్ట్’ స్ట్రీమింగ్ కి వచ్చేస్తోంది. యూట్యూబర్ విజయ్ కుమార్ రాజేంద్రన్ ఇందులో లీడ్ రోల్ లో నటించారు. 2025 డిసెంబర్ జరిగిన సౌత్ అన్‌బౌండ్ ఈవెంట్ సందర్భంగా జియోహాట్‌స్టార్ తన తమిళ వెర్షన్‌ లో అనేక ఆసక్తికరమైన టైటిల్స్‌ను ప్రకటించింది. అందులో ‘రిసార్ట్’ సిరీస్‌ను కూడా ప్రకటించారు. ఈ సిరీస్ ఒక హై-ఎండ్ రిసార్ట్‌లో సెట్ చేయబడింది. ఇది సరదాగా సాగిపోయే కామెడీ స్టోరీ. అయితే అప్పుడు స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. మరి ఈ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ లో ఉంటుంది ? దీని కథ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే

‘రిసార్ట్’ (Resort)సిరీస్ లో యూట్యూబర్ విజయ్ కుమార్ రాజేంద్రన్, తలైవాసల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అబెనేయ నేత్రున్, దర్శణ శ్రీపాల్ గోలేచా, ఎబి రాజ్న్, విష్ణు ముఖ్య పాత్రల్లో ఉన్నారు. ఈ సిరీస్ వచ్చే నెల మార్చి 13న జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇది తమిళ సిరీస్ అయినప్పటికీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక మరో తమిళ సిరీస్ తడయం, ఈ వారం ఫిబ్రవరి 27న Zee5లో డిజిటల్‌గా అరంగేట్రం చేయనుంది. ప్రముఖ నటుడు సముద్రఖని ఈ సిరీస్‌ వరుస హత్యలను దర్యాప్తు చేసే పోలీసు పాత్రలో కనిపించనున్నారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా ఒక లగ్జరీ బీచ్ రిసార్ట్ చుట్టూ తిరుగుతుంది. ఒక కుర్రాడు చదువు అబ్బక 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. ఒక లగ్జరీ రిసార్ట్‌లో రూమ్ సర్వీస్ బాయ్‌గా చేరతాడు. అక్కడ పని చేయడం అంటే ఏదో చిన్న విషయం అనుకుంటాడు కానీ, తీరా లోపలికి వెళ్ళాక అర్థమవుతుంది అక్కడ పరిస్థితి వేరని. ముఖ్యంగా ఆ రిసార్ట్ కిచెన్‌లో పనిచేసే చెఫ్‌లు, మేనేజ్‌మెంట్ ఇచ్చే టార్చర్‌ను ఎదుర్కొంటూ, ఆ కష్టాల్లో నుంచి అతను ఎలా గట్టెక్కాడనేది చాలా తమాషాగా చూపిస్తారు.

అయితే ఇది కేవలం ఒక హోటల్ కుర్రాడి సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు. ఆ రిసార్ట్‌కు వచ్చే గెస్టులు, అక్కడి సిబ్బంది మధ్య ఉండే రహస్యాలు, కొన్ని ప్రేమకథలు కూడా ఈ సిరీస్‌లో ఉంటాయి. బయటకు ఎంతో అందంగా, ప్రశాంతంగా కనిపించే ఆ రిసార్ట్ లోపల జరిగే పాలిటిక్స్ ఏంటి? ఆ రూమ్ సర్వీస్ కుర్రాడు తన తెలివితేటలతో ఆ సమస్యలన్నింటినీ ఎలా తట్టుకున్నాడు? అనేదే ఈ వెబ్ సిరీస్ అసలు కథ.

Advertisement

Read Also : రైతు ఆత్మహత్యలపై మూవీ… థియేటర్లలో విడుదలైన రెండున్నర ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×