E-Paper
Advertisement

OTT Movie : ఆ రూమ్ లోకి అడుగు పెడితే రెచ్చిపోయే అమ్మాయిలు… ప్రాణాంతకమైన ఉచ్చులోకి లాగే మిస్టరీ… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఆ రూమ్ లోకి అడుగు పెడితే రెచ్చిపోయే అమ్మాయిలు… ప్రాణాంతకమైన ఉచ్చులోకి లాగే మిస్టరీ… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే
Advertisement

OTT Movie : ఆడియన్స్ కి థ్రిల్ ఇచ్చే స్టోరీలు కావాలి, అవి ఏ భాషలో ఉన్నా చూసేస్తుంటారు. ఇప్పుడు థ్రిల్లర్ వెబ్ సిరీస్ లే ఎక్కువగా ట్రెండ్ కూడా అవుతున్నాయి. డిఫరెంట్ కంటెంట్ ని మూవీ లవర్స్ అస్సలు వదలటం లేదు. అలాంటి కంటెంట్ తో వచ్చిన ఒక సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ కథలో ఒక అమ్మాయి థ్రిల్ కోసం ‘రెడ్ రూమ్’ అనే గేమ్‌లో పడి ప్రమాదాలను తెచ్చుకుంటుంది. మొదట రొమాంటిక్ గా మొదలయ్యే ఈ స్టోరీ, ఆ తరువాత థ్రిల్లర్ వైబ్ కి మారుతుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘రెడ్ సిన్’ (Red sin) 2025లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. డీపాంకర్ ప్రకాష్ దీనికి దర్శకత్వం వహించారు. డైసీ షా లీడ్ రోల్ పోషించింది. 6 ఎపిసోడ్‌ ల ఈ సిరీస్‌, 2025 జూన్ 12 న ShemarooMe ఓటీటీలో విడుదల అయింది. IMDbలో ఈ కథకి 7.2/10 ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

తియా అనే యువతి ఒక సాధారణ అమ్మాయి. కానీ ఆమె జీవితంలో థ్రిల్, ఎక్సైట్‌మెంట్ కావాలని కోరుకుంటుంది. ఒక రోజు ఆమె ‘రెడ్ రూమ్’ అనే రహస్య గేమ్ గురించి తెలుసుకుంటుంది. ఈ గేమ్‌లో డబ్బున్న వాళ్లు, కొర్పొరేట్ వరల్డ్‌లోని పెద్ద వాళ్లు మాస్క్‌లు వేసుకుని, ప్రేమ ఆటలు ఆడతారు. తియా థ్రిల్ కోసం ఈ గేమ్‌లో చేరుతుంది. మొదట గేమ్ ఫన్‌గా, ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. కానీ త్వరగా అది డేంజరస్ అవుతుంది. గేమ్‌లో మోసాలు బయటపడతాయి. దీంతో తియా అక్కడ ఇబ్బందిలో చిక్కుకుంటుంది.

Read Also : మెడికల్ కాలేజీలో వరుస మరణాలు… అమ్మాయిల టార్గెట్… గుండె జారిపోయే సీన్లు ఉన్న హర్రర్ మూవీ

Advertisement

తియా గేమ్‌ ఆడుతూ కొందరితో ప్రేమలో పడుతుంది. కానీ అది మోసమని తెలుస్తుంది. గేమ్ వెనుక పెద్ద కుట్ర ఉందని, అది కొర్పొరేట్ వరల్డ్‌లోని చెడు వాళ్లతో ముడిపడి ఉందని తెలుస్తుంది. తియా గేమ్‌లోని రహస్యాలను కనుక్కోవడానికి ట్రై చేస్తుంది. కానీ కొంతమంది ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తారు. గేమ్‌లో డేంజర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు తియా తన తెలివితో బతకడానికి, బయటకు రావడానికి పోరాడుతుంది. చివరికి తియా రెడ్ రూమ్ గేమ్ వెనుక ఉన్న కుట్రను కనుక్కుంటుందా ? తియా ఆ గేమ్ నుంచి బయటకు వస్తుందా ? అసలు ఆ గేమ్ లో తియా పడ్డ నరకం ఏమిటి ? అనే విషయాలను, మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×