// // Constable Kanakam Season 2 : 'కానిస్టేబుల్ కనకం సీజన్ 2' -->
E-Paper
Advertisement

Constable Kanakam Season 2 : ‘కానిస్టేబుల్ కనకం సీజన్ 2’ ఓటీటీలో ఎందుకు చూడాలో తెలుసా ?

Constable Kanakam Season 2 : ‘కానిస్టేబుల్ కనకం సీజన్ 2’ ఓటీటీలో ఎందుకు చూడాలో తెలుసా ?
Advertisement

Constable Kanakam Season 2 : ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందింది ”కానిస్టేబుల్ కనకం’. ఓటీటీలో ఈ సిరీస్ మంచి విజయం సాధించింది. ఇక త్వరలో సీజన్ 2 ప్రీమియర్ కావడానికి వేదిక సిద్ధమైంది. రెండవ సీజన్ 2026 జనవరి 8 నుండి ETV Winలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుందని ఇప్పటికే అధికరికంగా వెల్లడించారు మేకర్స్. అయితే సిరీస్ రిలీజ్ కు ముందే అసలు ఆడియన్స్ ఈ దీన్ని ఎందుకు చూడాలి ? అనే నాలుగు ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం పదండి.

చంద్రికకు ఏమైంది?

కానిస్టేబుల్ కనకం సిరీస్ లో ఒక చిన్న గ్రామంలో ఉన్న అటవీ ప్రాంతంలో మహిళలు తప్పిపోతారు. వర్ష బొల్లమ్మ లేడి పోలీస్ పాత్రను పోషిస్తుంది. ఆమె సన్నిహితురాలు చంద్రిక కూడా ఇదే విధంగా తప్పిపోతుంది. తన సీనియర్ల నుండి ఎటువంటి మద్దతు లభించకపోవడంతో, ఆమె రంగంలోకి దిగుతుంది. అనంతరం చంద్రిక అదృశ్యం ఒక షాకింగ్ మలుపు తీసుకుంటుంది. అదేంటి అన్నది సీజన్ 2 లో వెల్లడి అవుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? తప్పిపోయిన మహిళల వెనుక ఎవరున్నారు ? అనేది ఈ సీజన్‌లో బయట పడుతుంది.

Advertisement

కానిస్టేబుల్ కనకం సినిమాలో వర్ష బొల్లమ్మ ప్రధాన పోలీసు పాత్రలో నటించగా, సినీయర్ నటుడు రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటించారు. శ్రీనివాస్ అవసరాల ప్రధాన విలన్ గా నటించారు. తప్పిపోయిన మహిళల వెనుక అతను ఉన్నాడా ? అనేది అతిపెద్ద ప్రశ్న. వర్ష బొల్లమ్మ నటన, ముఖ్యంగా కేసును ఛేదించే సమయంలో ఆమె ఎమోషన్స్ సిరీస్ లో మెయిన్ హైలైట్స్ లలో ఒకటని చెప్పవచ్చు.

సీజన్ 2 లో అద్భుతమైన మలుపులు

కానిస్టేబుల్ కనకం సీజన్ 1లో పెద్దగా ట్విస్టులేం లేవు. మేకర్స్ ఓ మోస్తరు థ్రిల్‌లతో కథనాన్ని నడిపించారు. కానీ రెండవ సీజన్ లో మాత్రం ఆ లోటును తీర్చబోతున్నారని తెలుస్తోంది. సీజన్ 2 చివరి రెండు ఎపిసోడ్‌లలో ఉండే మలుపులు ఆకట్టుకుంటాయని, షోకు గ్రిప్పింగ్ నోట్‌ తో ఎండ్ కార్డు వేయబోతున్నారని టాక్ నడుస్తోంది.

‘కానిస్టేబుల్ కనకం సీజన్ 3’ ఉందా?

Advertisement

ప్రేక్షకులలో ఈ సిరీస్ గురించి ఉన్న అతిపెద్ద ప్రశ్నలలో ఇది కూడా ఒకటి. మూడవ సీజన్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. భవిష్యత్తు సీజన్లకు అనుగుణంగా సీజన్ 2 ఎండింగ్ ఉంటుందని సమాచారం. అయితే, కానిస్టేబుల్ కనకంను ప్రస్తుతం రెండు సీజన్ల సిరీస్‌గానే ప్లాన్ చేశారు.

హీరోయిన్ కోసమైనా సిరీస్ ను చూడాల్సిందే

వర్ష బొల్లమ్మ తెలుగు సినిమాలలో ఇప్పటిదాకా హీరోయిన్ గా కన్పించింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించింది. కానీ ఈ సిరీస్‌లో ఆమె మొదటిసారి పోలీసు పాత్రను పోషిస్తుంది. ఒక పిరికి లేడి పోలీస్ తన గ్రామాన్ని కాపాడటానికి తీసుకున్న దృఢనిశ్చయంతో శక్తివంతమైన అధికారిణిగా ఎలా మారింది అన్నదే ఇందులోని ప్రధాన అంశం.

Read Also :  చైనా-భారత యుద్ధం ఆధారంగా తెరకెక్కిన వార్ డ్రామా ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×