E-Paper
Advertisement

OTT Movie : వార్డెన్ మర్డర్ కేసులో ఊహించని మలుపులు … ట్విస్ట్ లతో పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : వార్డెన్ మర్డర్ కేసులో ఊహించని మలుపులు … ట్విస్ట్ లతో పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : బాలీవుడ్ నుంచి వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తాయి. అందులోనూ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సినిమా అంటే, ప్రేక్షకులకు ఎక్స్పెక్టేషన్ చాలానే ఉంటుంది. కేవలం అతని నటన కోసమే సినిమాలను చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతలా ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు ఈ బాలీవుడ్ హీరో. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలీవుడ్ సినిమా, ఒక మర్డర్ మిస్టరీ కేసు చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఇన్స్పెక్టర్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ అదరగొట్టాడు. ఉత్తరాఖండ్ లోని సుందరమైన ప్రదేశంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాకు ఇది కూడా ఒక హైలెట్ గా నిలుస్తుంది. చివరి వరకు ట్విస్టులతో సాగిపోయే ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

జీ 5 (ZEE5) లో స్ట్రీమింగ్

Advertisement

ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రౌతు కా రాజ్’ (Rautu Ka Raaz). 2024 లో విడుదలైన ఈ సినిమాకు ఆనంద్ సురాపూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఉత్తరాఖండ్‌లోని రౌతు కీ బేలీ అనే ఊళ్లో జరుగుతుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాజేష్ కుమార్, నారాయణి శాస్త్రి, అతుల్ తివారీ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను జీ స్టూడియోస్ నిర్మించింది. ఇది 2024 జూన్ 28 నుంచి జీ 5 (ZEE5) ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

రౌతు కీ బేలీ అనే గ్రామంలో గత 30 సంవత్సరాలుగా ఎటువంటి క్రైమ్ జరిగి ఉండదు.  అయితే స్థానిక సేవాధామ్ స్కూల్‌లోని వార్డెన్ సంగీతా నీహావు ఒక రోజు హఠాత్తుగా హత్యకు గురవుతుంది. ఈ కేసును విచారించే బాధ్యత ఇన్‌స్పెక్టర్ దీపక్ సింగ్ నేగీ (నవాజుద్దీన్ సిద్ధిఖీ)కి  అప్పగించబడుతుంది. నేగీకి పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (PTSD) ఉంటుంది. అందువల్ల ఈ కేసు విచారణ మరింత సవాలుగా మారుతుంది. తనకు సహాయకుడిగా ఉండే, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ నరేష్ ప్రభాకర్ డిమ్రీ తో కలిసి, నేగీ ఈ హత్య మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. విచారణలో అనేక షాకింగ్ నిజాలు బయటపడతాయి. స్కూల్‌లోని అనేక మంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తారు.

కథలో అనేక ట్విస్టులు, టర్నులు వస్తూ ఉంటాయి. చివరకు ఈ హత్య వెనుక ఉన్న అసలు నేరస్తుడు ఎవరు ? వార్డెన్ ను ఎందుకు చంపాల్సివచ్చింది ? ఇన్‌స్పెక్టర్ ఈ కేసును ఎలా ఛేదిస్తాడు ?ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇన్‌స్పెక్టర్ నేగీగా తన నటనతో ఆకట్టుకున్నాడు. రాజేష్ కుమార్ తన కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాకు ఒక ఎనర్జీని తెచ్చాడు. ఇందులో క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మొత్తానికి ఈ సినిమా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఓటీటీలో అదరగొడుతోంది.

Read Also : ఆడవాళ్లను వీడియో తీసి చంపే సైకో … పోలీసులను కూడా వదలకుండా … రాధిక ఆప్టే క్రేజీ స్పై థ్రిల్లర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×