E-Paper
Advertisement

సైకో తమ్ముడి కోసం హాస్పిటల్ నే తగలబెట్టే నర్స్… ఐకానిక్ హర్రర్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

సైకో తమ్ముడి కోసం హాస్పిటల్ నే తగలబెట్టే నర్స్… ఐకానిక్ హర్రర్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

Psychological Thriller Series: మామూలుగా జనాలు కుటుంబం కోసం ఎంతకైనా తెగిస్తారు. తమ జోలికి వస్తే ఎవ్వరినీ వదిలి పెట్టరు. కానీ అదే ఫ్యామిలీలో పిచ్చోళ్ళు ఉంటే… కనీసం పట్టించుకోరు. కానీ ఓ సైకో నర్స్ చేసిన పనిని చూస్తే మాత్రం వణికిపోతారు. ఆ తరువాత ఆమెకు తమ్ముడు ఇచ్చిన బహుమతిని చూస్తే మెంటల్ ఎక్కాల్సిందే. ఇదంతా ఉన్న మూవీనే 2020లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ రాచెడ్ (ratched season 1). ‘వన్ ఫ్లూ ఓవర్ ది కుకూస్ నెస్ట్’ నవలలోని ఐకానిక్ విలన్ మిల్‌డ్రెడ్ రాచెడ్ పాత్ర ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్ లో హారర్ కాకుండా లోతైన మానసిక సంఘర్షణలు, రాజకీయాలు, హింస, శక్తి కోసం జరిగే కుట్రలు వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించారు.

కథలోకి వెళ్తే…

1947, కాలిఫోర్నియా. లూసియా స్టేట్ సైకియాట్రిక్ హాస్పిటల్‌లోకి అడుగు పెడుతుంది మిల్‌డ్రెడ్ రాచెడ్ (సారా పాల్సన్). పైకి అత్యంత పద్ధతిగా, దయాగుణం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆమె ఒక భయంకరమైన ప్లాన్ తో అక్కడికి అడుగు పెడుతుంది. అదే హాస్పిటల్‌కు తీసుకు వచ్చిన సీరియల్ కిల్లర్ ఎడ్మండ్ టోల్సన్ (ఫిన్ విట్రాక్) నిజానికి రాచెడ్ సొంత తమ్ముడు. చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో కలిసి పెరిగిన వారిద్దరి మధ్య ఉన్న బంధం ఆమెను ఇక్కడికి తీసుకొచ్చింది.

Advertisement

తన తమ్ముడిని ఎలక్ట్రిక్ చైర్ మరణశిక్ష నుంచి కాపాడాలనేదే ఆమె లక్ష్యం. హాస్పిటల్ లో డాక్టర్ రిచర్డ్ హనోవర్ (జాన్ జాన్ బ్రయోన్స్) మానసిక రోగులపై లోబోటోమీ, వేడి నీటి చికిత్స వంటి అమానవీయ ప్రయోగాలు చేస్తుంటాడు. రాచెడ్ తన తమ్ముడిని కాపాడుకునే క్రమంలో డాక్టర్‌ ను బ్లాక్‌మెయిల్ చేస్తుంది. హెడ్ నర్స్ బెట్సీ బకెట్‌ ను దాటి తానే సర్వాధికారిగా మారడానికి కుట్రలు చేస్తుంది. ఈ ప్రయాణంలో రాచెడ్ హాస్పిటల్‌ లోని రోగులు, సిబ్బందిని తన స్వార్థం కోసం హత్య చేస్తుంది. లేదంటే వారి ఆత్మహత్యలకు కారణమవుతుంది.

డాక్టర్ హనోవర్‌పై పాత పగతో ఉన్న లెనోర్ ఒస్గుడ్ (షాకన్ స్టోన్) కూడా కుట్రలు చేస్తుంది.చివరి ఎపిసోడ్‌ లో రాచెడ్ తన తమ్ముడికి విషం ఇచ్చి ప్రశాంతంగా చంపాలని ప్లాన్ చేస్తుంది. కానీ ఎడ్మండ్ తప్పించుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మెక్సికోలో సెటిల్ అయిన రాచెడ్‌కు ఎడ్మండ్ ఫోన్ చేస్తాడు. అప్పుడు కథ ఎలాంటి మలుపు తిరిగింది ? స్వంత తమ్ముడి కోసమే ఇదంతా చేసిన ఆ నర్స్ చివరికి అతన్ని ఎందుకు చంపాలి అనుకుంది ? క్లైమాక్స్ కథ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

సిరీస్ వివాదాలు

Advertisement

సిరీస్ విడుదలైనప్పుడు భారీ వివాదాలు రావడం గమనార్హం. మానసిక రోగులపై జరిగే అమానవీయ చికిత్సలు, లెస్బియన్ రొమాన్స్ సీన్లు, అత్యంత హింసాత్మక సన్నివేశాలు వల్ల చాలా మంది వ్యతిరేకించారు. కొంతమంది మానసిక ఆరోగ్య నిపుణులు ఈ సిరీస్ మానసిక రోగులను తప్పుగా చూపిస్తుందని విమర్శించారు. అయినప్పటికీ ఇది నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూసిన సిరీస్‌ల్లో ఒకటిగా నిలిచింది. ‘రాచెడ్’ ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. 8 ఎపిసోడ్ల ఈ మినీ సిరీస్.తెలుగు ఆడియో లేదు, కానీ ఇంగ్లీష్ ఆడియోతో హిందీ డబ్బింగ్, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : అమ్మాయిపై అఘాయిత్యం, ఐదుగురు ఎన్కౌంటర్… హైదరాబాద్ ను షేక్ చేసిన రియల్ స్టోరీ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×