E-Paper
Advertisement

Thamma OTT: సడెన్గా ఓటీటీలోకి వచ్చేసిన రష్మిక హారర్ మూవీ.. చిన్న ట్విస్ట్ ఏంటంటే..

Thamma OTT: సడెన్గా ఓటీటీలోకి వచ్చేసిన రష్మిక హారర్ మూవీ.. చిన్న ట్విస్ట్ ఏంటంటే..
Advertisement

Thamma OTT : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ నటించిన లేటెస్ట్ చిత్రం థామా.. బాలీవుడ్ నిర్మాణ సంస్థ మాడాక్ హారర్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమా 200 కోట్లకి పైగా వసూలు చేసింది.. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.. కలెక్షన్ కూడా మంచిగానే రావడంతో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. థియేటర్లలో సినిమాని మిస్ అయిన వాళ్లు ఓటీటీలో ఈ హారర్ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అయితే ఈ మూవీ డిజిటల్ హక్కుల గురించి ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు.. ఓటిటిలోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చేసింది.. ఈ మూవీని చూసిన మూవీ లవర్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం..

‘ థామా’ ఓటీటీ డీటెయిల్స్.. 

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప మూవీ తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది.. పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్ గా మంచి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. అంతే కాదు ఫాన్ ఇండియా వైడ్ గా సినిమాలను చేస్తూ బిజీగా కూడా ఉంది.. ఈ ఏడాది రష్మిక మందన్న నటించిన సినిమాలో అన్నీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి.. ఈ అమ్మడు ఎప్పుడూ రొమాంటిక్ పాత్రలో నటిస్తూ వస్తుంది. కానీ థామా వంటి హారర్ మూవీలో నటించి ప్రేక్షకులను భయపెట్టింది. థియేటర్లలో మంచి టాక్ ను అందుకున్న ఈ మూవీ ఓటీటీలోకి సడెన్గా ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కేవలం రెంటల్ గా మాత్రమే అందుబాటులో ఉంది. సో 350 చెల్లించి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. అలాగే ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది.. మీరు కూడా చూసేయ్యండి.

‘థామా’ స్టోరీ విషయానికొస్తే.. 

Advertisement

ఇందులో అలోక్ గోయల్ ఒక న్యూస్ జర్నలిస్ట్.. తన ఫ్రెండ్స్తో కలిసి ఓ రోజు పర్వత ప్రాంతానికి న్యూస్ కవరేజీకి వెళ్తాడు.. అక్కడ అనుకోకుండా ఎలుగుబంటి దాడి చేయడానికి వస్తుంది..తడ్కా కాపాడుతుంది. బేతాళ జాతికి చెందిన యువతి తడ్కా మనుషుల రక్తం తాగే అలవాటు ఉంటుంది. కొన్ని దివ్య శక్తులు కూడా ఉంటాయి.. ఈ జాతి పెద్ద ఓ తప్పు చెయ్యడంతో అతన్ని గృహలో బంధిస్తారు. అలాంటి బేతాళ సామ్రాజ్యంలోకి వచ్చిన గోయల్ను ఆ జాతి వారు శిక్షించాలని చూడగా తడ్కా తప్పిస్తుంది.. అలా అతనిపై ఇష్టంతో ఆమె జనంలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళ ప్రేమ ఎలా మొదలవుతుంది? హీరోకి హీరోయిన్ గురించి నిజం తెలిసి పోతుందా..? తెలిసిన తర్వాత ఎటువంటి ట్విస్టులు ఎదురవుతాయి? అన్నది ఈ సినిమా స్టోరీలో చూడాలి… థియేటర్లలో మంచి సక్సెస్ ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలో ఏమాత్రం లాభాలను అందిస్తుందో చూడాలి..

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×