E-Paper
Advertisement

The Girl Friend: ఓటీటీలో అదరగొడుతున్న ది గర్ల్ ఫ్రెండ్, నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో నెం.1

The Girl Friend: ఓటీటీలో అదరగొడుతున్న ది గర్ల్ ఫ్రెండ్, నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో నెం.1
Advertisement

The Girl Friend-Netflix: కొన్ని సినిమాలు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి విపరీతమైన సక్సెస్ సాధిస్తుంటాయి. అలా చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. కింద సినిమా చాలామందికి బీభత్సంగా నచ్చేసింది.

Advertisement

సినిమాలో రష్మిక భూమా దేవి అనే క్యారెక్టర్ లో కనిపించింది. పాత్రకు ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. రాహుల్ రవీంద్రన్ గతంలో చేసిన ‘మన్మధుడు 2‘ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ సినిమా మీద ఎటువంటి అంచనాలు లేవు కానీ థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా సప్రైజ్ చేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా బీభత్సంగా చేశారు. ముఖ్యంగా ట్విట్టర్లో ప్రతి పాజిటివ్ ట్వీట్ ను షేర్ చేస్తూ తనదైన స్థాయిలో రెస్పాండ్ అయ్యాడు రాహుల్.

ఇండియాలో ట్రెండింగ్ నెంబర్ వన్

ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సినిమాకి ప్రస్తుతం విపరీతమైన రెస్పాన్స్ నెట్ఫిక్స్ లో కూడా లభిస్తుంది. ఇండియా నెంబర్ వన్ ట్రెండింగ్ లో ప్రస్తుతం ఈ సినిమా ఉంది. నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా ట్రెండింగ్ కు వచ్చింది అంటే ఏ స్థాయిలో ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారో మరోసారి అర్థమవుతుంది.

Advertisement

అయితే ఈ సినిమా థియేటర్స్ లో ఆడుతున్నప్పుడే ప్రతి థియేటర్కు వెళ్లి ఆడియన్స్ రెస్పాన్స్ తీసుకున్నాడు రాహుల్. అలానే ఎవరికైనా ఈ సినిమా గురించి క్యారెక్టర్రైజేషన్ గురించి డౌట్స్ ఉంటే వాటిని ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి కొన్ని రీల్స్ కూడా విపరీతంగా పాపులర్ అయ్యాయి. కేవలం థియేటర్స్ లోనే కాకుండా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఓటీటీ లో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది అని అర్థమయిపోతుంది.

సోషల్ మీడియాలో ప్రశంసలు

అయితే ఈ సినిమాను చాలామంది చూడకముందు కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లో కూడా అవైలబుల్ గా ఉండడంతో చాలామంది సినిమాను చూసి ప్రశంసలు అందిస్తున్నారు. మరోసారి ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో టాపిక్స్ నడుస్తున్నాయి. ఇంకా చాలామంది రాహుల్ రవీంద్రన్ అద్భుతమైన సినిమా తీశాడు అంటూ ఇప్పటికీ కూడా పొగుడుతూనే ఉన్నారు. ఈ సినిమాకి విపరీతమైన ప్రశంసలు మరియు అద్భుతమైన కలెక్షన్స్ తో ఓటీటీ రెస్పాన్స్ కూడా వచ్చేసింది. మొత్తానికి ఇలా అన్ని వర్గాల్లో సినిమా సంతృప్తిని ఇవ్వడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×