E-Paper
Advertisement

ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ అప్డేట్…మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్..ఎందుకంటే?

ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ అప్డేట్…మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్..ఎందుకంటే?
Advertisement

Dhurandhar 2 OTT: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇటీవల ధురంధర్ 2 (Dhurandhar 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి వందల కోట్ల కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టిస్తుంది. ఆదిత్యధర్ డైరెక్షన్లో ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయి మంచి ఆదరణను సొంతం చేస్తుంది. ఇలా థియేటర్లో విడుదలైన నెల రోజులకే సినిమాలు తిరిగి డిజిటల్ మీడియాలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో విడుదల కాగా ఏప్రిల్ మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అందరూ భావించారు కానీ ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యేలా ఉందని తెలుస్తుంది.

జూన్ నెలలో ధురంధర్ 2 స్ట్రీమింగ్..

ధురంధర్ సినిమా కూడా థియేటర్లలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమా నెట్ ఫ్లెక్స్ లో ప్రసారమయ్యే అక్కడ కూడా అదే ఆదరణ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ధురంధర్ 2 మాత్రం నెట్ ఫ్లిక్స్ లో కాకుండా జియో హాట్ స్టార్(Jio Hot Star) లో ప్రసార కాబోతుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్ భారీ ధరలకు కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా జియో హాట్ స్టార్ లో అనుకున్న విధంగా ఏప్రిల్ మూడో వారంలో కాకుండా జూన్ లేదా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది.

ఐపీఎల్ దెబ్బకు వెనక్కి తగ్గిన ధురంధర్ 2 ..

Advertisement

ఇలా ఈ సినిమా ఆలస్యంగా ఓటీటీలో విడుదల కావడానికి కారణం లేకపోలేదు ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ కారణంగా ఈ సినిమాకు ఓటీటీలో పెద్దగా ఆదరణ రాకపోవచ్చని చిత్ర బృందం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని జూన్ లేదా జూలై నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువగా ఈ సినిమా జూన్ రెండవ వారంలో విడుదల కాబోతోందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఓటిటి విడుదల పట్ల వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

ధురంధర్ 2 కోసం ఎదురుచూపులు తప్పవా?

Advertisement

ఇలా ఈ సినిమా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు అనుగుణంగానే జూన్ లేదా జూలై నెలలో విడుదల అయితే డిజిటల్ మీడియాలో ధురంధర్ 2 చూడాలనుకునే వారికి నిరాశ తప్పదనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు ఆదిత్యధర్ దర్శకత్వం వహించగా, రణవీర్ సింగ్, సారా అర్జున్ హీరో హీరోయిన్లుగా నటించారు.అక్షయ్ ఖన్నా, అర్జున్ రామ్ పాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ వంటి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read: ఫాన్స్ కి గుడ్ న్యూస్..వారణాసి నుంచి మహేష్ రాముడి లుక్ ..ఆ స్పెషల్ డే రిలీజ్?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×