E-Paper
Advertisement

Rakkasapuradhol on OTT : మతిపోగొట్టే ట్విస్టులు… థియేటర్లలో దుమ్మురేపుతున్న ఈ సూపర్ హిట్ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

Rakkasapuradhol on OTT : మతిపోగొట్టే ట్విస్టులు… థియేటర్లలో దుమ్మురేపుతున్న ఈ సూపర్ హిట్ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?
Advertisement

Rakkasapuradhol on OTT : రాజ్ బి శెట్టి పోలీస్ పాత్రలో నటించిన ‘రక్కసపురధోల్’ ఇటీటీలోకి వచ్చేస్తోంది. ఈ కన్నడ సినిమా థియేటర్లలో ఉన్నప్పుడే ఓటీటీ డీల్ కూడా అయిపోయింది. కన్నడ సినిమాలకు ఇలా డీల్ సెట్ అవ్వడం చాలా అరుదు కూడా. ఒక సినిమా థియేటర్లలో ఉండగానే డిజిటల్ గా కూడా వెళ్ళగలిగితే అది సగం విజయం సాధించినట్లే. ఈ సినిమాలో రాజ్ తన కెరీర్‌లో తొలిసారిగా పోలీసుగా నటిస్తున్నాడు. నేరాలు జరగని ఒక గ్రామంలో జరిగిన వరుస హత్యల దర్యాప్తు చేస్తున్న SI శివ పాత్రలో రాజ్ బి శెట్టి కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం పదండి.

రక్కసపురధోల్ ఎక్కడ చూడాలి?

నూతన దర్శకుడు రవి సారంగ దర్శకత్వంలో స్టంట్ మాస్టర్ రవి వర్మ నిర్మించిన ‘రక్కసపురధోల్’ ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల అయింది. అయితే అదేరోజు 6న శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా అమ్ముడయ్యాయి. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. కాబట్టి థియేటర్లలో విడుదలైన తర్వాత జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా OTTplay ప్రీమియం ద్వారా కూడా అందుబాటులో ఉంటుంది. స్ట్రీమింగ్ తేదీ ఇంకా అధికారికంగా నిర్ధారించబడనప్పటికీ, ఈ సినిమా మార్చి మొదటి వీక్ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. రక్కసపురధోల్ లో అర్చన కొట్టిగే, స్వాతిష్ట కృష్ణన్, బి సురేష్, జహంగీర్, సిద్ధన్న, గౌరవ్ శెట్టి, అనిరుధ్ భట్ తదితరులు నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రక్కసపుర అనే ఊరిలో వరుసగా జరుగుతున్న భయంకరమైన హత్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఆ ఊరి ప్రజలంతా ఈ చావుల వెనుక ‘కొల్లి దెయ్యం’ ఉందన్న భయంతో వణికిపోతుంటారు. సరిగ్గా అదే సమయంలో, తాగడుకి బానిసైన శివ (రాజ్ బి శెట్టి) అనే ఎస్.ఐ ఆ ఊరికి ట్రాన్స్ఫర్ పై వస్తాడు. అతను తన వ్యక్తిగత బాధలతో సతమతమవుతూనే, ఈ హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే పనిలో పడతాడు. అందరూ అది దెయ్యం పనే అని నమ్ముతున్నా, శివ మాత్రం దీని వెనుక మనుషుల కుట్ర ఏదో ఉందని అనుమానిస్తాడు. తన తెలివితేటలతో, మూఢనమ్మకాలకు తావు లేకుండా అసలు హంతకుడు ఎవరో కనిపెట్టడమే ఈ కథలోని అసలు ట్విస్ట్. దెయ్యం కథలా అనిపిస్తూనే ఎమోషన్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా సాగుతుంది.

Read Also : ఓటీటీలోకి కామెడీ సినిమా… నలుగురు పెళ్లాలతో పరుగులు పట్టించే సరికొత్త స్టోరీ… ఎక్కడ చూడొచ్చంటే ?

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×