E-Paper
Advertisement

OTT Movies : ఈ వీకెండ్‌కు ఇంట్లోనే అచ్చ తెలుగు ఎంటర్టైన్మెంట్… ఓటీటీలో 5 కొత్త సినిమాలు సిరీసులు

OTT Movies : ఈ వీకెండ్‌కు ఇంట్లోనే అచ్చ తెలుగు ఎంటర్టైన్మెంట్… ఓటీటీలో 5 కొత్త సినిమాలు సిరీసులు
Advertisement

OTT Movies : ఈ వారం తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు అద్భుతమైన ట్రీట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటిలా కాకుండా ఈ వీకెండ్ కు ఓటీటీలలో అచ్చ తెలుగు అద్భుతమైన కంటెంట్ ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధంగా ఉంది. సినిమాలు, ఒక వెబ్ మూవీ, మరో సిరీస్ తో సహా మొత్తం ఐదు కొత్త తెలుగు సినిమాలు ఓటీటీలలోకి వచ్చేశాయి. మరి ఈ వారం తెలుగు మూవీ లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ఆ 5 సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai)

ఈ చిన్న బడ్జెట్ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కొత్త దర్శకుడు సాయిలు కాంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్ ఉద్దేమరి, తేజస్వి రావు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇప్పుడు ETV Winలో ప్రసారం అవుతోంది. చైతు జొన్నలగడ్డ విలన్‌గా నటించారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ గ్రామీణ నేపథ్యం, ​​నటన, క్లైమాక్స్‌లోని షాక్ ఫ్యాక్టర్ సూపర్ గా ఉంటాయి.

ప్రేమంటే (Premante)

Advertisement

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రేమంటే’. ఇందులో ప్రియదర్శి, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయినప్పటికీ, ఓటీటీలో మాత్రం దుమ్మురేపే అవకాశం ఉంది. ఈ సినిమా డిసెంబర్ 19 అంటే ఈరోజు నుంచే నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం అవుతోంది. ఈ మూవీకి నవనీత్ శ్రీరామ్ దర్శకుడు.

సంతాన ప్రాప్తిరస్తు (Santhana Prapthirasthu)

విక్రాంత్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ బోల్డ్ తెలుగు చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. పురుషులలో పిల్లలు పుట్టకుండా చేసే వంధ్యత్వ సమస్యను వినోదాత్మకంగా ఈ మూవీ ద్వారా చూపించారు. సంజీవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్ట్రీమింగ్ డిసెంబర్ 19న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar)లలో షురూ అయ్యింది. నవంబరులో థియేటర్లలో సందడి చేసిన ‘సంతాన ప్రాప్తిరస్తు’కు పెద్దగా ఆదరణ దక్కలేదు. మరిప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

దివ్యదృష్టి (Divyadristi)

Advertisement

సునీల్, ఇషా చావ్లా, కమల్ కామరాజు నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సన్ నెక్స్ట్ (Sun Nxt) లో డైరెక్ట్ డిజిటల్ విడుదలైంది. కబీర్ లాల్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ చిత్రం స్ట్రీమింగ్ ఓటీటీలో డిసెంబర్ 19 నుండి ప్రారంభమయ్యింది. ఈ చిత్రం ఇషా చావ్లా పోషించిన అంధ బాలిక కథ.

నయనం (Nayanam)

ప్రముఖ తెలుగు నటుడు వరుణ్ సందేశ్ ఈ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి అడుగు పెడుతున్నాడు. ‘నయనం’ ఒక సైకలాజికల్ థ్రిల్లర్. స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించిన 6 ఎపిసోడ్‌ల ఈ షో డిసెంబర్ 19 నుండి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ఇందులో కథానాయికగా నటించింది. వరుణ్ సందేశ్ నటించిన ఈ చిత్రం ఒక క్రేజీ డాక్టర్ గురించి. అతను ప్రత్యేక శక్తులను పొంది వాటిని దుర్వినియోగం చేసి అమాయక ప్రజలను చంపేస్తాడు.

Read Also :  ఇంట్లోంచి పారిపోయి పెళ్లి… పిల్లలు పుట్టట్లేదని… తెలుగు మూవీనే భయ్యా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×