E-Paper
Advertisement

Rajeev Kanakala: రాజీవ్ కనకాల ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్ ఎలా ఉందంటే?

Rajeev Kanakala: రాజీవ్ కనకాల ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ట్రైలర్ ఎలా ఉందంటే?
Advertisement

Rajeev Kanakala: రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలలో నటించిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు’ (D/o Prasad Rao: Kanabadutaledhu). ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ మేకర్స్ నుంచి రాబోతోన్న మరో ఇంట్రెస్టింగ్, క్రైమ్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్‌పై కె.వి. శ్రీరామ్ నిర్మించారు. కృష్ణ పోలూరు (Krishna Poluru) దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్.. ఫిబ్రవరి 27 నుంచి జీ5 (Zee 5)లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌కు సంబంధించి మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ట్రైలర్‌ను బుధవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

Also Read- O Andala Rakshasi: అమ్మాయిల జోలికి వస్తే.. ఈ సుందర రాక్షసి అక్కడ కుమ్మేస్తుందట!

ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా

Advertisement

‘‘అమ్మికి ఏమైందో అని భయంగా ఉంది రమేషా.. అని రాజీవ్ కనకాల (Rajeev Kanakala) చెబుతున్న డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ మొదలైంది. ఆ తర్వాత కూతురు పుట్టినప్పటి నుంచి పెద్దది అయ్యే వరకు.. తండ్రికి ఎంత ప్రేమ ఉందో చెప్పే సన్నివేశాలతో హార్ట్ టచ్ చేశారు. ‘నాకు జాబ్ ఎక్కడ వచ్చిందో తెలుసా? హైదరాబాద్‌లో’, ‘ఫస్ట్ జీతం రాంగానే తీసుకెళ్లి మా నాన్న చేతిలో పెట్టేయాలి’ అని చెప్పే డైలాగ్స్‌తో కూతురికి తండ్రి మీదున్న ప్రేమను తెలియజేశారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. హాయిగా నవ్వుతూ అంతా నడిచిపోతున్న సమయంలో.. మా పాపను జాగ్రత్తగా చూసుకోండమ్మా అని రాజీవ్ చెబుతుండగానే.. ‘నిన్న రాత్రి నుంచి ఒకమ్మాయి హాస్టల్‌లో కనిపించడం లేదు’ అంటూ కూతురు మిస్ అవ్వడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే సీన్లతో ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Also Read- Tamannaah: ఆ తెలుగు స్టార్ హీరోకి మాత్రమే లిప్ కిస్ పెడతాను అంటున్న తమన్నా..!

స్వాతి అనే అమ్మాయి ఎలా మిస్సయింది?

Advertisement

‘ఆ అమ్మాయి కనిపించకపోవడానికి, ఆ అమ్మాయి రూమ్‌మేట్స్‌కి ఏదో సంబంధం ఉందని వార్డెన్‌కి అనుమానం’ అనే డైలాగ్‌తో ఇందులోని కంటెంట్ తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే సీన్లన్నీ.. ఎక్కడో రియల్‌గా జరుగుతున్నట్టే అనిపిస్తాయి. ‘కళ్ల ముందే ఏదో ఉంది.. కానీ నేను ఏదో మిస్ అవుతున్నాను.. నేను ఏం మిస్ అవుతున్నాను’ అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెబెకా జోసెఫ్ పాత్రలో ఉదయ భాను (Uday Bhanu) చెప్పిన డైలాగ్‌తో ఇందులో చాలానే ట్విస్టులు ఉన్నాయనేది అర్థమవుతోంది. అసలు స్వాతి అనే అమ్మాయి ఎలా మిస్సయింది? దీని వెనుకున్నది ఎవరు? హాస్టల్‌లో స్నేహితులు కారణమా? ఆఫీసులో గొడవలా? ఈ కేసులో తండ్రి పాత్ర ఏంటి? అనే పలు రకాల ప్రశ్నల్ని లేవనెత్తేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 27 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ట్రైలర్ చూసేందుకు Click Here

Also Read- Biker Movie: దిల్ రాజు చేతికి శర్వానంద్ ‘బైకర్ ‘ తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులు..

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×