E-Paper
Advertisement

Paanch Minaar OTT: థియేటర్లోకి వచ్చిన వారానికే ఓటీటీలోకి పాంచ్ మినార్!

Paanch Minaar OTT: థియేటర్లోకి వచ్చిన వారానికే ఓటీటీలోకి పాంచ్ మినార్!
Advertisement

Paanch Minaar OTT: ఇటీవల కాలంలో సినిమాల పట్ల ఓటీటీ ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఓటీటీ డీలింగ్ ప్రకారమే సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇక థియేటర్లోకి వచ్చిన కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే సినిమాలన్నీ కూడా ఓటీటీలో ప్రసారమవుతున్నాయి. అయితే థియేటర్లో విడుదలైన కేవలం వారం రోజుల వ్యవధిలోనే సినిమా ఓటీటీలోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. టాలీవుడ్ అండ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) ఇటీవల నటించిన క్రైమ్ థ్రిల్లర్ కామెడీ చిత్రం పాంచ్ మినార్(Paanch Minar). ఈ సినిమా నవంబర్ 21వ తేదీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

7 రోజులకే ఓటీటీలోకి పాంచ్ మినార్ ..

ఇలా థియేటర్లలో ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ తరుణంలోనే గత శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాంచ్ మినార్ ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్లో విడుదలైన వారం రోజుల వ్యవధిలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో అందుబాటులోకి వచ్చింది. ఇదివరకు రాజు తరుణ్ నటించిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ వెంటనే ఓటీటీలోకి రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడిగా నటి రాశి సింగ్(Rashi Singh) హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు రామ్ కుడుముల దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమాని మాధవి, ఎంఎస్ఎమ్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

క్రైమ్ థ్రిల్లర్ కామెడీగా..

Advertisement

రాజ్ తరుణ్ ఇటీవల కాలంలో తన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తలో నిలుస్తున్నారు. అయినప్పటికీ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈయన నటించిన సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ కామెడీ గా వచ్చిన పాంచ్ మినార్ కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేకపోయింది. ఈ తరుణంలోనే థియేటర్లో విడుదలైన వారానికే ఓటీటీలోకి వచ్చేసిందని చెప్పాలి.

ఈ సినిమా కథ విషయానికి వస్తే..

Advertisement

కృష్ణ చైతన్య అలియాస్ కిట్టు(రాజ్ తరుణ్) బిట్‌కాయిన్ స్కాంలో భాగంగా లక్షల్లో డబ్బును నష్టపోతారు. అయితే ఈ నష్టాన్ని తిరిగి పూడ్చడం కోసం కిట్టు క్యాబ్ డ్రైవర్ గా మారిపోతారు. ఇలా ఒకరోజు తన క్యాబ్ లో ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లు తమ టార్గెట్‌లను చంపుతారు. కిట్టు ఎలాగోలా తప్పించుకున్నా కూడా కిట్టుని చంపాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ తరుణంలోనే ఆ ఇద్దరు కాంట్రాక్టు కిల్లర్లు లోకల్ రౌడీ మూర్తి(అజయ్ ఘోష్), అలాగే CI అయ్యర్(నితిన్ ప్రసన్న)తో కలిసి కిట్టుని చంపే ప్రయత్నం చేస్తుంటారు. మరి వారి నుంచి కిట్టు ఎలా తప్పించుకున్నారనేదే ఈ సినిమా కథ.

Also Read: Lokesh Kanagaraj: ఐకాన్ స్టార్ ను ఇంప్రెస్ చేసిన లోకేష్ కనగరాజ్…భారీ ప్రాజెక్ట్ లోడింగ్?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×