E-Paper
Advertisement

OTT Movie : ఈ మూవీని చూశాక లైఫ్ లో లిఫ్ట్ ఇవ్వరు, ఇచ్చినా తీసుకోరు… వెన్నులో వణుకు పుట్టించే సీన్స్

OTT Movie : ఈ మూవీని చూశాక లైఫ్ లో లిఫ్ట్ ఇవ్వరు, ఇచ్చినా తీసుకోరు… వెన్నులో వణుకు పుట్టించే సీన్స్
Advertisement

OTT Movie : షార్ట్ ఫిల్మ్ లతో ఎంతో మంది తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. కొన్ని నిమిషాల స్టోరీతోనే ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. వీటికి జాతీయ అవార్డులు కూడా దక్కుతున్నాయి. అన్ని జానర్లలో ఈ షార్ట్ ఫిల్మ్స్ అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే షార్ట్ ఫిల్మ్ ఒక నిర్మానుష్య రోడ్డులో, ఇద్దరు అపరిచిత వ్యక్తుల మధ్య ఒక భయంకరమైన వాతావరణంలో జరుగుతుంది. ఇది ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

Advertisement

ఈ హిందీ హారర్ షార్ట్ ఫిల్మ్ పేరు ‘రాహ్’ (Raah). 2015 లో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ కి ప్రతీక్ పయోధి దర్శకత్వం వహించారు. ఇందులో స్వర్ణిమా తెలంగ్, రిషి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ 16 నిమిషాల రన్‌టైమ్‌తో, ఒక భయంకరమైన రహదారి చుట్టూ తిరుగుతుంది. ఇది ఇద్దరు అపరిచితుల మధ్య జరిగే సంఘటనలను ఒక భయంకరమైన వాతావరణంలో చూపిస్తుంది. ఇది యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఈ కథ ఒక రాత్రి సమయంలో, “హాంటెడ్” రహదారిగా పిలవబడే ఒక నిర్మానుష్య రోడ్డు మీద జరుగుతుంది. ఒక వ్యక్తి (రిషి వర్మ), తన కారులో ఒక ఎయిర్ కండిషనర్ బాక్స్‌తో ప్రయాణిస్తూ, ఒక మహిళ (స్వర్ణిమా తెలంగ్)కు లిఫ్ట్ ఇస్తాడు. ఆమె ఈ రహదారి గురించి భయంకరమైన కథలను చెబుతూ అతనిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో అతను కూడా ఆమెను భయపెట్టడానికి తన సొంత కథలను చెబుతాడు. వారి సంభాషణ మొదట ఉత్సాహంగా సాగినప్పటికీ, ఈ రహదారిలో గతంలో జరిగిన సంఘటనలు, వీళ్ళు ఒకరిని ఒకరు భయపెట్టుకునే ప్రయత్నాలు కథను ఒక ఆశ్చర్యకరమైన మలుపు వైపు నడిపిస్తాయి.

ఈ షార్ట్ ఫిల్మ్ హారర్ అంశాలను సస్పెన్స్‌తో నడిపిస్తూ, రహదారి చీకటి వాతావరణంలో ఒక భయంకరమైన అనుభవాన్ని సృష్టిస్తుంది. కథ ఒక  చిన్న ట్విస్ట్‌తో ముగుస్తుంది. అయితే ఇది ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. చివరికి ఆ రోడ్డులో ఏం జరుగుతుంది ? వీళ్ళు భయాలను ఊహించుకుని వెళ్తుంటారా ? గతంలో అక్కడ ఎలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ షార్ట్ ఫిల్మ్ ను మిస్ కాకుండా చుడండి.

Read Also : పెళ్లి ఫిక్సయిన అమ్మాయిలు కిడ్నాప్… చేతులు నరికి, ముక్కలు ముక్కలుగా పారేస్తూ కిరాతకంగా చంపే సైకో కిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×