E-Paper
Advertisement

కొడుకు చావుకి రివేంజ్… మనుషులు ఇంత బ్రూటల్ గా కూడా ఉంటారా భయ్యా

కొడుకు చావుకి రివేంజ్… మనుషులు ఇంత బ్రూటల్ గా కూడా ఉంటారా భయ్యా
Advertisement

Horror Movie OTT : హారర్ సినిమాలకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి, పెద్దలదాకా ఇష్టపడే జానర్ ఇది. ఎప్పటి నుంచో ఈ జానర్ ప్రేక్షకులను భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తోంది. అయితే టెక్నాలజీ అంతగా లేని రోజుల్లో దెయ్యాలను చాలా భయంకరంగా చూపించిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా దాదాపు నాలుగు దశాబ్ధాల క్రితం వచ్చింది. అయితే ఆ కాలంలో గ్రాఫిక్స్ వాడకుండా కేవలం మేకప్, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ద్వారా ఒక రాక్షసుడిని సృష్టించడం ఈ సినిమా గొప్పతనం. ఇది ఒక గొప్ప హారర్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. భయంకరమైన రాక్షసులు ఉండే సినిమాలు, పాత కాలపు క్లాసిక్ హారర్ సినిమాలను ఇష్టపడితే, ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

1988లో వచ్చిన ఈ క్లాసిక్ హారర్ మూవీ పేరు ‘పంప్‌కిన్‌హెడ్’ (Pumpkinhead). ఈ సినిమాకు స్టాన్ విన్‌స్టన్ దర్శకత్వం వహించారు. ఈయన హాలీవుడ్‌లో ‘టెర్మినేటర్’, ‘జురాసిక్ పార్క్’, ‘ఏలియన్స్’ వంటి సినిమాలకు అద్భుతమైన రోబోటిక్ బొమ్మలను తయారు చేసిన మేధావి. అందుకే ఈ సినిమాలో రాక్షసుడు చాలా భయంకరంగా కనిపిస్తాడు. చాలా తక్కువ ఖర్చుతో తీసినప్పటికీ, ఈ సినిమా హారర్ ప్రేక్షకుల్లో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. నేటికీ చాలా మంది హారర్ ఫ్యాన్స్ పాత సినిమాల్లో బెస్ట్ క్రీచర్ డిజైన్ ఈ సినిమాదే అని చెప్తారు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ వల్ల దీని తర్వాత Pumpkinhead II: Blood Wings (1993), Pumpkinhead: Ashes to Ashes (2006), Pumpkinhead: Blood Feud (2007) అనే మూడు భాగాలు వచ్చాయి. ఇవే కాకుండా దీనిపై కామిక్ బుక్స్, ఒక వీడియో గేమ్ కూడా విడుదలయ్యాయి. ఇక ప్రధాన పాత్రలో నటించిన లాన్స్ హెన్రిక్సెన్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా Tubi, Pluto tvలలో అందుబాటులో ఉంది. prime video, Apple tvలలో అద్దెకు కూడా తీసుకోవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఎడ్ హార్లే అనే వ్యక్తికి తన చిన్న కొడుకు అంటే ఎంతో ప్రేమ. ఒకరోజు సిటీకి చెందిన కొందరు యువకులు చేసిన చిన్న తప్పు వల్ల ఆ అబ్బాయి ప్రమాదానికి గురై మరణిస్తాడు. కొడుకును కోల్పోయిన బాధలో ఉన్న హార్లే, ఎలాగైనా ఆ యువకులపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. పగతో రగిలిపోతున్న హార్లే, అడవిలో ఉండే ఒక మంత్రగత్తె సాయం కోరతాడు. అందుకు ఆమె అంగకరించి, ఒక పాత సమాధిలో ఉన్న భయంకరమైన శవానికి ప్రాణం పోస్తుంది. అదే ‘పంప్‌కిన్‌హెడ్’ అనే రాక్షసుడు. ఆ రాక్షసుడు హార్లే పగను తీర్చడానికి ఆ యువకులను ఒక్కొక్కరిగా వేటాడటం మొదలెడతాడు.

Also Read : సమ్మర్ లో పిల్లలు మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 5 యానిమేషన్ మూవీస్

Advertisement

అయితే ఆ రాక్షసుడు చేసే ప్రతి హత్య వల్ల కలిగే నొప్పిని హార్లే కూడా స్వయంగా అనుభవిస్తాడు. రాక్షసుడికి, అతనికి మధ్య ఒక తెలియని బంధం ఏర్పడుతుంది. పగ తీర్చుకోవడం వల్ల శాంతి కలగకపోగా, తనే ఒక రాక్షసుడిగా మారుతున్నానని హార్లే గ్రహిస్తాడు. చివరికి ఆ హింసను ఆపడానికి అతను తీసుకునే ఒక సాహసోపేతమైన నిర్ణయంతో కథ ముగుస్తుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×