// // Psychological Thriller OTT :సైకోలకే చమటలు పట్టించే థ్రిల్లర్ మూవీ -->
E-Paper
Advertisement

సైకోలకే చమటలు పట్టించే మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ…

సైకోలకే చమటలు పట్టించే మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ…
Advertisement

Psychological Thriller OTT :ఈ రోజుల్లో టెక్నాలజీ పరుగులు పెడుతోంది. ఫోన్ ఉపయోగించి సినిమాలు కూడా తీసేస్తున్నారు. అలాంటి ప్రయోగాలు సక్సెస్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే హాలీవుడ్ సినిమా పూర్తిగా ఐఫోన్ 7 ప్లస్ ఉపయోగించి తీశారు. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలను కూడా పొందింది. ఈ స్టోరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా భలే ఉంటాయి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం పేరు ‘అన్‌సేన్’ (Unsane). 2018లో వచ్చిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు స్టీవెన్ సోడర్‌బర్గ్ తెరకెక్కించారు. ఇందులో క్లైర్ ఫోయ్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకోగా, హాలీవుడ్ స్టార్ నటుడు మ్యాట్ డామన్ ఒక చిన్న అతిథి పాత్రలో కనిపించి అలరించారు. ఈ సినిమా షూటింగ్ పరంగా ఒక పెద్ద సంచలనం సృష్టించింది. దర్శకుడు స్టీవెన్ సోడర్‌బర్గ్ ఈ మొత్తం సినిమాని కేవలం ఐఫోన్ 7 ప్లస్ ఉపయోగించి, 10 రోజుల్లోనే పూర్తి చేశారు. అతి తక్కువ బడ్జెట్‌తో, అంటే దాదాపు 12 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం Netflix ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక యువతిని ఎవరో అపరిచితుడు ఎప్పుడూ ఫాలో అవుతుంటాడు. ఆ టార్చర్ తట్టుకోలేక భయంతో తన ఊరు వదిలి కొత్త సిటీకి వస్తుంది. అక్కడ కూడా ఆమెకు ఆ భయం పోదు. దాంతో మానసిక ప్రశాంతత కోసం ఒక హాస్పిటల్‌లో కౌన్సెలింగ్‌కు వెళ్తుంది. కానీ అక్కడ ఆమెకు మానసిక సమస్య ఉందని చెప్పి బలవంతంగా అడ్మిట్ చేసుకుంటుంది హాస్పిటల్ యాజమాన్యం. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆ హాస్పిటల్ చేసే మోసం వల్ల ఆమె అక్కడ బందీ అవుతుంది. అక్కడికి వెళ్ళాక ఆమెకు అసలు షాక్ తగులుతుంది. తనను వేధించిన ఆ వ్యక్తి, పేరు మార్చుకుని అదే హాస్పిటల్‌లో వార్డ్ బాయ్‌గా జాయిన్ అవుతాడు. ఆమె అతడిని గుర్తుపట్టి అందరికీ మొత్తుకున్నా, ఆమెకు పిచ్చి అని ఎవ్వరూ నమ్మరు. పైగా అతడు ఆమెను మరింత చిత్రహింసలకు గురిచేస్తుంటాడు. ఆ నరకం నుండి బయటపడటానికి ఆమె చేసే ప్రయత్నాలే సినిమాను ఉత్కంఠగా మారుస్తాయి. చివరికి ఆ వ్యక్తి నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమె తీవ్రంగా పోరాడుతుంది. హాస్పిటల్ లోపల ఎవరి సాయం లేకపోయినా, తన తెలివితేటలతో అతడిని ఎలా ఎదుర్కొంది? ఆ భయంకరమైన పరిస్థితి నుండి ఆమె బయటపడిందా లేదా? అనేదే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ క్లైమాక్స్.

Read Also : ప్రశాంత జీవితాన్ని తలకిందులు చేసిన హత్య… ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త మలుపు… ఊహకు అందని క్లైమాక్స్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×