E-Paper
Advertisement

Psychological Thriller OTT : 6 ఆస్కార్ నామినేషన్లు… IMDB రేటింగ్ 8.2… ఇలాంటి సినిమాను ఇప్పటిదాకా చూసుండరు భయ్యా

Psychological Thriller OTT : 6 ఆస్కార్ నామినేషన్లు… IMDB రేటింగ్ 8.2… ఇలాంటి సినిమాను ఇప్పటిదాకా చూసుండరు భయ్యా
Advertisement

Psychological Thriller OTT : దాదాపు పాతిక సంవత్సరాల క్రితం ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ సంచలనాలను సృష్టించింది. 1999 లో రిలీజ్ అయిన ఈ మూవీ 2000 లో అనేక ఆస్కార్ నామినేషన్లను పొందింది. అంతేకాకుండా దీనికి ఐయండిబిలో మంచి రేటింగ్ కూడా ఉంది. ఇప్పటికీ టాప్ టెన్ జాబితాలో ఈ సినిమా ఉంది. ఒక డాక్టర్ ఒక చిన్న పిల్లాడి చుట్టూ తిరిగే ఈ కథ, ప్రేక్షకుల ఊహకు అందని విధంగా క్లైమాక్స్ వరకు సాగుతుంది. దీని పేరు ఏమిటి ? ఇందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

ఈ సినిమా పేరు ఏమిటంటే

‘ది సిక్స్త్ సెన్స్’ (The sixth sense)  1999లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. దీనిని ఎం. నైట్ శ్యామలన్ రచించి దర్శకత్వం వహించారు. ఇందులో బ్రూస్ విల్లీస్ సైకాలజిస్ట్ పాత్రలో నటించారు. ఇందులో అతని రోగి తాను చనిపోయిన వారిని చూడగలనని, వారితో మాట్లాడగలనని చెప్పుకుంటాడు. అతనికి ట్రీట్ మెంట్ ఇవ్వడం చుట్టూ కథ ఉంటుంది. 1999 ఆగస్టు 6 న విడుదల అయిన ఈ సినిమా విమర్శకులచేత ప్రశంసలు అందుకుంది.

Advertisement

ఇది శ్యామలన్‌కు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఓస్మెంట్‌కు ఉత్తమ సహాయ నటుడు, కొల్లెట్‌కు ఉత్తమ సహాయ నటితో సహా ఆరు అకాడమీ అవార్డులకు నామినేట్ చేయబడింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అప్పట్లోనే $672 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటివరకు శ్యామలన్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఐయండిబిలో 8.2 రేటింగ్ కూడా దీనికి ఉంది. prime video లో ఇది అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

ఫిలడెల్ఫియాలో నివసించే చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ మాల్కం క్రో (బ్రూస్ విల్లిస్), కోల్ సీర్ (హేలీ జోయెల్ ఓస్మెంట్) అనే ఎనిమిదేళ్ల బాలుడికి చికిత్స చేస్తాడు. ఆ బాలుడు తాను చనిపోయిన వ్యక్తులను చూస్తున్నాను అని డాక్టర్‌తో చెబుతాడు. మొదట్లో ఇది మానసిక సమస్య అని డాక్టర్ భావించినప్పటికీ, క్రమంగా ఆ బాలుడికి నిజంగానే ఆ శక్తులు ఉన్నాయని గ్రహిస్తాడు. ఆ ఆత్మలకు సహాయం చేయడం ద్వారా తన భయాన్ని ఎలా పోగొట్టుకోవాలో కోల్‌కు డాక్టర్ నేర్పిస్తాడు. ఇక ఈ సినిమా ముగింపులో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తుంది. సినిమా అంతా కోల్‌కు చికిత్స చేస్తున్న డాక్టర్ మాల్కం నిజానికి సినిమా ప్రారంభంలోనే చనిపోయి ఉంటాడని, అతను కూడా ఒక ఆత్మేనని చివరలో తెలుస్తుంది.

Advertisement

Read Also : దున్నపోతును బలి తీసుకునే దెయ్యం బొమ్మ … అఘోరాలకే దిమ్మతిరిగే హారర్ స్టోరీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×